స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ హీరోగా ఆ మధ్య ‘సీనయ్య’ అనే సినిమా మొదలైన సంగతి తెలిసిందే. తన బేనర్ కి ‘దిల్’ తో మొదటి సక్సెస్ ఇచ్చిన వినాయక్ ని హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు ఆ సినిమాను నిర్మించాలనుకున్నాడు. ఓపెనింగ్ కూడా గ్రాండ్ గా చేశారు. కానీ అనుకోని విధంగా ఆ సినిమా క్యాన్సెల్ అయ్యింది. ఆ సినిమా దర్శకుడు నరసింహ రావు ఇచ్చిన ఫైనల్ నెరేషన్ నచ్చకపోవడంతో సెట్స్ పైకి వెళ్ళకముందే సినిమా ఆగిపోయింది. ఇక వినాయక్ యాక్టింగ్ కెరీర్ కి మొదటి సినిమానే బ్రేక్ వేసింది. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో వినాయక్ దర్శకుడిగా ఛత్రపతి హిందీ రీమేక్ మొదలు పెట్టి బిజీ అయిపోయాడు.
అయితే ఇప్పుడు వినాయక్ హీరోగా కొత్త సినిమా ఒకటి ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. తాజాగా వినాయక్ కి ఓ కొత్త దర్శకుడు ఇంట్రెస్టింగ్ కథ చెప్పాడట. వినాయక్ కి కథ బాగా నచ్చడంతో ఆ దర్శకుడిని వర్క్ స్టార్ట్ చేయమని చెప్పేశాడట. ప్రస్తుతానికి ఈ సినిమా గురించి ఎలాంటి డీటెయిల్స్ లేవు కానీ ప్రాజెక్ట్ మాత్రం లాక్ అయిందని అంటున్నారు. అన్ని కుదిరితే దిల్ రాజునే ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ కి సంబంధించి ఫైనల్ షెడ్యుల్ మిగిలింది. ఆ సినిమా షూట్ కంప్లీట్ చేసిన వెంటనే తను హీరోగా తెరకెక్కనున్న సినిమాను మొదలు పెట్టనున్నాడట వినాయక్.
ఇక తెలుగులో నటులుగా మారి సక్సెసయిన దర్శకులు కొందరున్నారు. దాసరి , కే విశ్వనాధ్ వంటి వారు నటులుగా రాణించి మంచి పాత్రలను పోషించారు. మరి వినాయక్ నటుడిగా ఎలాంటి విజయం అందుకుంటాడో వేచి చూడాలి.
This post was last modified on June 11, 2022 9:40 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…