కరోనా తర్వాత ఓటిటిలకు డిమాండ్ పెరిగిన తరుణంలో సబ్స్క్రైబర్స్ ని కాపాడుకోవడం సదరు సంస్థలకు పెద్ద సవాల్ గా మారుతోంది. కేవలం సినిమాలనే నమ్ముకుంటే లాభం లేదని కొత్త ఎత్తుగడలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా ఆహా వేస్తున్న ప్రణాళికలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. అన్ స్టాపబుల్ షోతో బాలయ్యలోని యాంకర్ ని బయటికి తీసి దాని రూపంలో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న ఆహా ఆ తర్వాత ఇండియన్ ఐడల్ సింగింగ్ ని లాంచ్ చేసి అంతకన్నా పెద్ద టార్గెటే పెట్టుకుంది.
ఇటీవలే జరిగిన సెమి ఫైనల్ కు బాలకృష్ణ అతిథిగా హాజరు కాగా ఫైనల్ కు ఏకంగా చిరంజీవిని తీసుకొచ్చి విజేతకు గ్రాండ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చారు. విన్నర్ ఎవరన్నది లీక్ కాలేదు కానీ స్ట్రీమింగ్ జరిగే 17వ తేదీ కన్నా ముందే ఏదో రూపంలో బయటికి వచ్చేస్తుంది. ఈ రెండు ఎపిసోడ్లలో సందర్భానికి తగ్గట్టు బాలకృష్ణ, చిరంజీవిలు తమ పాటలకు తామే సరదాగా చిన్న చిన్న స్టెప్స్ వేయడం ఫ్యాన్స్ కి భలే కిక్ ఇస్తోంది. చిరు వచ్చే భాగంలోనే విరాటపర్వం ప్రమోషన్ కోసం వచ్చిన సాయిపల్లవి కూడా పాల్గొనడం మరో ఆకర్షణ.
ఎంత పాటలు పాడే ప్రోగ్రాం అయినా ఆహా దీనికి భారీగా ఖర్చు పెట్టింది. ఇండియన్ ఐడల్ ఫ్రాంచైజీ హక్కులతో పాటు గాయకుడు శ్రీరామ్ ని యాంకర్ చేయడం, తమన్, నిత్య మీనన్ లాంటి బిజీ ఆర్టిస్టులను జడ్జ్ లుగా తీసుకురావడం కోసం పారితోషికాలు గట్టిగానే ముట్టజెప్పింది. వారానికో కొత్త సినిమా అంటూ అప్పట్లో అల్లు అర్జున్ తో చేయించిన యాడ్ తర్వాత ఆహా ఆ మాట మీద పూర్తిగా కట్టుబడలేదు. ఆ లోటుని ఇలాంటి రియాలిటీ షోల ద్వారా పూడ్చుకునే పనిలో ఉంది. సోషల్ మీడియాని గమనిస్తే దీనికి రెస్పాన్స్ బాగుందని అర్థమైపోతుంది. సెకండ్ సీజన్ కు సైతం అప్పుడే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని వినికిడి
This post was last modified on June 11, 2022 8:44 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…