మాములుగా స్టార్ హీరోయిన్లు కొత్త సినిమాల ప్రమోషన్లకు రావడమే మహాభాగ్యంలా ఫీలవుతుంటారు నిర్మాతలు. ఇక నయనతార లాంటి వాళ్ళు సరేసరి. అగ్రిమెంట్ చేసే టైంలోనే ఎక్కడికి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేస్తారు. చిరంజీవైనా సత్యదేవైనా తేడా చూపించరు. అలాంటిది వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చిన విరాట పర్వం కోసం సాయిపల్లవి ఎడతెరిపి లేకుండా పబ్లిసిటీలో పాల్గొనడం మెచ్చుకోవాల్సిన విషయమే. గత వారం రోజులుగా పూర్తిగా హైదరాబాద్ లోనే మకాం వేసి అన్ని ప్రోగ్రాంలు అటెండ్ అవుతోంది.
రానా సైతం వీలు చిక్కినప్పుడంతా ఆమెనే హైలైట్ చేస్తున్నాడు. ఇవాళ ఇచ్చిన ఇంటర్వ్యూలో రవన్న క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చని కానీ సాయిపల్లవికి మాత్రం మరో ఆప్షన్ లేదని ఖరాఖండిగా ఎలాంటి ఈగో లేకుండా చెప్పేశాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రోమోలో సైతం ఆమె కోసమే సినిమా తీశామని నొక్కి వక్కాణించాడు. ఇలా భాగ్యనగరంలో గడుపుతున్న టైంలోనే సాయిపల్లవికి ఓ టీవీ ఛానల్ తమ సీరియల్ యాడ్స్ లో జస్ట్ కొన్ని నిమిషాలు నటిస్తే రెండు కోట్ల ఆఫర్ ఇస్తే నిర్మోహమాటంగా తిరస్కరించిందని మీడియా వర్గాల టాక్.
మొత్తానికి విరాటపర్వం భారం అధికంగా సాయిపల్లవి మీదే ఉంది. ఓపెనింగ్స్ విషయంలోనూ ఆమె బ్రాండే హెల్ప్ చేసేలా ఉంది. సినిమా బాగుంటే ఎలాగూ మౌత్ టాక్ రూపంలో పాకిపోతుంది కానీ మొదటి రెండు మూడు రోజులు జనం థియేటర్లకు రావాలంటే ఫస్ట్ రీజన్ తనే అవుతోంది. అందుకే ఆహాలో షో, యుట్యూబ్ ముఖాముఖీలు, న్యూస్ ఛానల్స్ కార్యక్రమాలు, రోడ్ ట్రిప్పులు, కర్నూల్ నుంచి వరంగల్ దాకా రకరకాల ఈవెంట్లు దేనికీ నో చెప్పకుండా వెళ్ళిపోతోంది. ఇంతకన్నా ఎవరు మాత్రం ఏం చేయగలరు.
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…