Movie News

అల్లు శిరీష్‌ను ఎందుకిలా వదిలేస్తున్నారు?

మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు టాలీవుడ్లోకి అరంగేట్రం చేశారు. అందులో చాలామంది హీరోలుగా పెద్ద రేంజికి వెళ్లారు. కొందరు మీడియం రేంజి హీరోలుగా కొనసాగుతున్నారు. చివరగా ఈ కుటుంబం నుంచి వచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ కూడా అరంగేట్రంలోనే ‘ఉప్పెన’ లాంటి బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. రెండో సినిమా ‘కొండపొలం’తో తన అభిరుచిని చాటుకున్నాడు.

ఇప్పుడు అతడి చేతిలో క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. ఐతే పదేళ్ల కిందటే మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ మాత్రం కెరీర్లో ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయాడు. ఒక్క ‘శ్రీరస్తు శుభమస్తు’ మినహాయిస్తే అతడి కెరీర్లో హిట్లు లేవు. చివరగా ‘ఏబీసీడీ’ లాంటి ఫ్లాప్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు శిరీష్.

మామూలుగా పెద్ద ఫ్యామిలీల నుంచి వచ్చే హీరోలను ఎలాగోలా పైకి తేవడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు. విరామం లేకుండా సినిమాలు చేయిస్తారు. కాస్త పేరున్న దర్శకులను ఎంచుకుంటారు. కానీ మంచి బిజినెస్‌మ్యాన్ అయిన అల్లు అరవింద్ మాత్రం తన చిన్న కొడుకు కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదని మొదట్నుంచి అనిపిస్తూనే ఉంది.

సొంత బేనర్లో అతడితో చిన్న బడ్జెట్లలో ‘కొత్తజంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలను మాత్రమే ప్రొడ్యూస్ చేశారాయన. ‘శ్రీరస్తు శుభమస్తు’తో శిరీష్ కెరీర్‌కు కొంచెం ఊపు వచ్చినట్లు కనిపించినా.. ‘ఒక్కక్షణం’తో మళ్లీ కింద పడ్డాడు. ఆపై ‘ఏబీసీడీ’ సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత శిరీష్ కెరీర్ మీద అందరూ ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది. కొత్త సినిమా ఖరారవ్వడానికి చాలా టైం పట్టింది.

చివరికి ‘ప్రేమ కాదంట’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. దీని ఫస్ట్ లుక్ రిలీజై ఏడాది దాటింది. ఇప్పటిదాకా కొత్త అప్‌డేట్ లేదు. అసలీ సినిమా పూర్తయిందా, రిలీజవుతుందా అనే విషయాల్లో రకరకాల సందేహాలు కలుగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా శిరీష్ ముందులా యాక్టివ్‌గా ఉండట్లేదు. తన సినిమా అప్‌డేట్ ఇవ్వట్లేదు. అందరూ కలిసి శిరీష్‌ను ఇలా వదిలేశారేంటా అని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు.

This post was last modified on June 13, 2022 9:33 am

Share

Recent Posts

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

45 seconds ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

2 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

4 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

6 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

11 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

12 hours ago