టాప్ హీరోల కెరీర్లపై అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వాళ్లు చేస్తున్న సినిమాల స్టేటస్ ఏంటి.. ఫ్యూచర్ ప్రాజెక్టుల మాటేంటి అనే విషయాలు తెలుసుకోవాలని వాళ్లు చూస్తుంటారు. టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన అల్లు అర్జున్ కొత్త సినిమాలపై ఎప్పుడూ సస్పెన్స్ నడుస్తుంటుంది. అతను హడావుడిగా సినిమాలు ఒప్పుకుని చకచకా చేసుకుపోయే రకం కాదు.
కొందరు స్టార్లు ఒకేసారి రెండు సినిమాలను లైన్లో పెడుతుంటారు. సమాంతరంగా సినిమాలు చేస్తుంటారు. ఇంకొందరేమో ఒక సినిమా చేస్తుండగానే ఇంకో సినిమాకు అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటారు. ఈ సినిమా పూర్తవడం ఆలస్యం ఆ సినిమా మొదలు పెట్టేస్తుంటారు. కానీ బన్నీ మాత్రం ఇలా చేయడు. ఒక సినిమాకు ఇంకో సినిమాకు గ్యాప్ తీసుకుంటూ ఉంటాడు. ఈ మధ్య మరీ జాగ్రత్త ఎక్కువైపోయి.. రెండు సినిమాల మధ్య బాగా గ్యాప్ వస్తోంది.
‘నా పేరు సూర్య’ తర్వాత దాదాపు రెండేళ్లకు ‘అల వైకుంఠపురములో’ వచ్చింది. ఆ తర్వాత ‘పుష్ప’ సినిమా మొదలుపెట్టడంలోనూ ఆలస్యం జరిగింది. దీని తర్వాత ‘పుష్ప-2’కు కూడా గ్యాప్ తప్పలేదు. మధ్యలో ఇంకో సినిమా చేసే అవకాశం ఉన్నా బన్నీ ఛాన్స్ తీసుకోవట్లేదు. ‘పుష్ప-2’ తర్వాతి సినిమా మీదా ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.
ఐతే ఇటీవల సంజయ్ లీలా బన్సాలీతో బన్నీ సమావేశం అయిన నేపథ్యంలో వీరి కలయికలో సినిమా ఉంటుందా అన్న ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో బన్నీ మిత్రుడు, నిర్మాత బన్నీ వాసు ఒక ఇంటర్వ్యూలో బన్నీ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతానికి బన్నీ చేతిలో ‘పుష్ప-2’ మినహా వేరే సినిమా ఏదీ లేదని వాసు క్లారిటీ ఇచ్చాడు.
బన్సాలీ, బన్నీ కాంబినేషన్లో సినిమా గురించి అడిగితే.. బన్సాలీకి ‘పుష్ప’ నచ్చిందని, అలాగే బన్నీ ‘గంగూబాయి కథియావాడీ’ని ఇష్టపడ్డాడని.. ఈ నేపథ్యంలో ఒకరినొకరు కలవాలని అనుకున్నారని, కుదిరినపుడు కలిశారని, అంతకుమించి ఆ కలయికకు ఎలాంటి ప్రాధాన్యత లేదని వాసు స్పష్టం చేశాడు. బన్నీ కొత్త సినిమాపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, దసరా టైం లో ప్రకటన వచ్చే అవకాశముందని, అతడి కొత్త సినిమా గురించి జరుగుతున్న ప్రచారమేదీ నిజం కాదని వాసు స్పష్టం చేశాడు.
This post was last modified on June 13, 2022 12:03 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…