అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప ది రైజ్’ కి సీక్వెల్ గా రానున్న ‘పుష్ప ది రూల్ ‘ సినిమాకు సంబంధించి త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతుంది. జులై చివర్లో లేదా ఆగస్ట్ లో ఈ సీక్వెల్ తో బన్నీ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. హైదరాబాద్ , చెన్నై , కేరళ లతో పాటు చిత్తూరు జిల్లా , మారేడుమిల్లి ప్రాంతాల్లో షూటింగ్ చేయాలని షెడ్యుల్స్ రెడీ చేస్తున్నారు. ముందుగా హైదరాబాద్ లో ఓ సాంగ్ షూట్ చేసి తర్వాత మారేడుమిల్లిలో ఓ షెడ్యుల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ సీక్వెల్ రిలీజ్ కి సంబంధించి పుష్ప రిలీజ్ టైంలో బన్నీ ఓ డేట్ చెప్పాడు. పుష్ప రిలీజైన డిసెంబర్ లోనే పుష్ప 2 కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు. కానీ ఇప్పుడు డిసెంబర్ కాకుండా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. డిసెంబర్ లోనే పుష్ప భారీ వసూళ్ళు అందుకుంది. అదే సంక్రాంతి సీజన్ అయితే ఇంకా గట్టిగా కలెక్షన్స్ రాబట్టేది. కానీ అప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం డిసెంబర్ కి షిఫ్ట్ చేసుకున్నారు.
ఇక తాజాగా జరిగిన షెడ్యుల్ డిస్కషన్స్ లో ఈ సినిమాను నవంబర్ లేదా డిసెంబర్ కల్లా పూర్తి చేసి జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ఓ మాట అనుకున్నారని సమాచారం. సుకుమార్ మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. రాజమౌళి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో షూటింగ్ కి ఎక్కువ డేస్ తీసుకునేది సుక్కునే. మరి నిర్మాతలు చెప్పిన టైంకి సుక్కు ఈ సీక్వెల్ ని కంప్లీట్ చేసి భారీ అంచనాలను అందుకోవడం అంటే కష్టమే. ప్రస్తుతానికయితే మేకర్స్ సంక్రాంతి రిలీజ్ కే ఫిక్సయ్యారు.
This post was last modified on June 10, 2022 7:58 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…