రవితేజ సినిమాకు అదే ప్రాబ్లమ్ ?

అన్ని అనుకున్నట్లు జరిగితే మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ వచ్చే వారం థియేటర్స్ లోకి రావాలి. కానీ ఉన్నపళంగా రిలీజ్ డేట్ పోస్ట్ చేసుకోవడంతో ఆ ప్లేస్ లో రానా ‘విరాటపర్వం’ వచ్చి చేరింది. రవితేజ సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం ఏమిటనే విషయంపై తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఓ టాక్ వినబడుతుంది. ఈ సినిమాకు సంబంధించి రవితేజకి ఇంకా రెమ్యునరేషన్ డీల్ క్లోజ్ అవ్వలేదని అందుకే రవితేజ బ్యాలెన్స్ సాంగ్ షూటింగ్ రావడం లేదని అంటున్నారు.

రవితేజ పక్కా కమర్షియల్. రెమ్యునరేషన్ విషయంలో చాలా పక్కాగా ఉంటాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటుంటారు. దీంతో ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ మీద వచ్చిన ఈ వార్త ఏదైతే ఉందో అది రవితేజ మీద ఉన్న ఒపీనియన్ కి మరింత బలం చేకూరుస్తుంది. ఈ సినిమాతో శరత్ అనే కొత్త దర్శకుడు ప్రేక్షకులకు పరిచయం అవ్వబోతున్నాడు. సినిమా అంతా పూర్తయింది. ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆ సాంగ్ ఫినిష్ చేస్తే సినిమా రిలీజైపోతుంది.

ఈ సినిమాకు రవితేజ బేనర్ కూడా యాడ్ అయింది. ఆర్ టి టీం వర్క్స్ ని కూడా షేర్ బేస్ లో ఇంక్లూడ్ చేసాడట రవితేజ. ఆ డీలింగ్ విషయంలో కూడా ఇంకా ఏవో చర్చలు జరుగుతున్నాయని టాక్. ఏదేమైనా ఇది జస్ట్ రూమరెనా ? లేదా నిజంగానే సినిమా ఫైనాన్షియల్ ఇష్యుస్ ఫేజ్ చేస్తుందా ? తెలియాల్సి ఉంది.