ప్రస్తుతం యంగ్ దర్శకులు డైరెక్షన్ తో పాటు యాక్టింగ్ మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే తరుణ్ భాస్కర్ హీరోగా టర్న్ అయ్యి ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అలాగే విశ్వక్ సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ కూడా చేశారు తరుణ్. ఇప్పుడు కోవలో మరో దర్శకుడు చేరాడు.
‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వెంకటేష్ మహా నటుడిగా మారాడు. మొన్నీ మధ్యే సత్య దేవ్ తో ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య’ అనే సినిమా డైరెక్ట్ చేశాడు వెంకటేష్. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్ లో ఏదో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. అలాగే ఓ వెబ్ సిరీస్ ఆఫర్ కూడా వెంకటేష్ చేతిలో ఉంది. కానీ ఏది సెట్స్ పైకి వెళ్ళడం లేదు. అందుకే యాక్టర్ గా టర్న్ తీసుకున్నాడు.
నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ‘అంటే సుందరానికీ’ సినిమాలో హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకునే కుర్రాడిగా కనిపించాడు వెంకటేష్ మహా. అది కూడా గెస్ట్ అప్పిరియన్స్ కాదు. నాలుగైదు సన్నివేశాలున్న పాత్రే. నిజానికి వివేక్ , వెంకటేష్ మహా ఒకేసారి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. పైగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. అందుకే వివేక్ సినిమాలో ఓ కీ రోల్ ని వెంకటేష్ మహా తో చేయించి నటుడిగా మార్చాడు.
ఇక మొదటి సినిమా టైంకి కాస్త మోటుగా కనిపించిన వెంకటేష్ మహా ఇప్పుడు స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నాడు. బహుశా ఆ లుక్ చూసే వివేక్ తనకి ఈ పాత్ర ఇవ్వాలని అనుకున్నాడెమో. ఏదేమైనా దర్శకుడు నటుడిగా మారితే కొన్ని అడ్వాంటేజ్ లు ఉంటాయి. దర్శకుడికి ఏం కావాలి అది పక్కాగా డెలివరీ చేస్తారు. డైరెక్టర్స్ లో కాస్త ఈజ్ ఉంటే ఎలాంటి పాత్రైనా చేసేయొచ్చు. మరి వెంకటేష్ మహా ఇకపై నటుడిగా కంటిన్యూ అవుతాడా లేదా దర్శకుడిగా సినిమాలు చేసుకుంటాడా చూడాలి.
This post was last modified on June 10, 2022 6:46 pm
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…