పేరుకి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలన్నారు కానీ ముందు రోజు మధ్యాన్నం నుంచే జురాసిక్ వరల్డ్ డొమినియన్ ఇండియా వైడ్ ప్రీమియర్లు భారీగా వేసుకుంది .ఇది చివరి భాగమని నిర్మాణ సంస్థ ముందుగానే ప్రకటించడంతో బిగ్ స్క్రీన్ మీద డైనోసార్లను చూద్దామని ఫ్యాన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగానే చేసుకున్నారు. ఇకపై ఈ సిరీస్ లో సినిమాలు రాబోవడం లేదు. అందులోనూ 3డి, ఐమ్యాక్స్ అంటూ రకరకాల వెర్షన్లను ఇవ్వడంతో అభిమానుల క్రేజ్ పీక్స్ లో ఉంది. ఇంతకీ స్పెషల్ షోల రిపోర్ట్స్ ఏమంటున్నాయి.
కథ విషయానికి వస్తే అంతమైపోయిందనుకుంటున్న డైనోసర్ జాతిని ఎక్కడో దూరంగా ఒక డాక్టర్ ప్రయోగశాలలో పెంచుతూ ఉంటాడు. పంటలను నాశనం చేసే కీటకాలు వేల సంఖ్యలో ల్యాబ్ లో ఉంటాయి. హీరో ఓ చిట్టడివిలో ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉండగా కూతురిని, తనతో పాటు అక్కడ అడవుల్లో తిరిగే బుల్లి డైనోసార్ ని ఆ డాక్టర్ ముఠా కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతోంది. ఈ పాప ఎవరో కాదు. 1993లో ఒరిజినల్ జురాసిక్ పార్క్ సృష్టించిన పెద్దాయన మనవరాలు. ఆ గ్యాంగ్ ని పట్టుకునేందుకు బయలుదేరిన హీరో హీరోయిన్లతో పాటు వీళ్ళకు సహాయం చేసేందుకు వచ్చిన ఫస్ట్ పార్ట్ టీమ్ మొత్తం ప్రమాదంలో పడుతుంది. ఆ తర్వాత జరిగేదే అసలు స్టోరీ.
విజువల్ ఎఫెక్ట్స్ గ్రాండ్ గా ఉన్నప్పటికీ జురాసిక్ సబ్జెక్టులో జ్యుస్ ఎప్పుడో అయిపోయింది. ఎంతసేపూ డైనోసర్లు వెంటబడటం, వాహనాల్లో జనాలు తప్పించుకోవడం, అవి కొట్టేసుకోవడం, పరిగెత్తడం మొత్తం ఇదే తంతు. ఫస్ట్ హాఫ్ లో ఒక చేజింగ్ ఎపిసోడ్, క్లైమాక్స్ ముందు వచ్చే థ్రిల్లింగ్ సీన్ తప్ప మిగిలినదంతా ఏమంత గొప్పగా లేదు. దర్శకుడు కోలిన్ ట్రెవోర్రో చెప్పుకునే స్థాయిలో మాయాజాలం చేయలేకపోయాడు. మళ్ళీ చూసే ఛాన్స్ ఉండదు కాబట్టి జురాసిక్ వీరాభిమానులకు ఓ మోస్తరుగా నచ్చవచ్చేమో కానీ సగటు ప్రేక్షకులకు మాత్రం గతంలో వచ్చిన సీక్వెల్స్ స్థాయిలో ఈ డోమినన్ సంతృప్తినివ్వలేకపోయిందన్నది వాస్తవం.
This post was last modified on June 10, 2022 7:09 am
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…
మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…