మరికొన్ని గంటల్లో నాని నటించిన ‘అంటే సుందరనికీ’ థియేటర్స్ లోకి రాబోతుంది. టీజర్ , ట్రైలర్ ప్రామిసింగ్ అనిపించుకున్నాయి. సినిమాలో కూడా కంటెంట్ ఉందని నాని మళ్ళీ సీట్లో కూర్చుబెట్టి హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయబోతున్నాడని అర్థమవుతుంది. దర్శకుడు కూడా టాలెంటెడే. బ్రోచేవారెవరురా వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇలా ఎటు చూసిన అంటే కి అంతా పాజిటివ్ గానే ఉంది. కానీ ఒక్కటే సమస్య ఉంది. అదే నిడివి.
అవును సినిమా నిడివి దాదాపు మూడు గంటలు ఉంది. రెండు గంటల యాబై సెకన్ల పైనే రన్ టైం లాక్ చేసుకున్నారు. ఇటివలే దర్శకుడు , అలాగే హీరో నాని ఇద్దరూ తమకి రన్ టైం ప్రాబ్లెం లేదని సినిమా చూశాక ఇంత సేపు అంత సేపు అనే డిస్కషన్ ఉండదని గట్టిగానే చెప్తున్నారు. పైగా మైత్రి మూవీ మేకర్స్ కి ఎక్కువ నిడివితో ఉన్న సినిమాలు మంచి విజయాలు అందించాయి. అది కూడా ఓ సెంటిమెంట్ అనుకోవచ్చు.
ఏదేమైనా రం టైం అనేది ఇప్పుడు చాలా ముఖ్యం అయిపోయింది. రెండున్నర గంటలే ప్రేక్షకులకు థియేటర్స్ లో బోర్ కొట్టేస్తుంది. మధ్య మధ్యలో సెల్ ఫోన్స్ పట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ‘అర్జున్ రెడ్డి’,’మహానటి’,’రంగస్థలం’ ఇలా కొన్ని క్లాసిక్ హిట్స్ మాత్రమే రన్ టైం ఎక్కువ అన్న మాటే లేకుండా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి. మరి ‘అంటే సుందరానికీ’ కూడా అదే కోవలోకి వస్తుందా ? చూడాలి. ఈ ఒక్క సమస్యను అధిగమించి సినిమా ఎంటర్టైన్ చేస్తే మంచి వసూళ్ళు అందుకోవడం ఖాయం.
This post was last modified on June 10, 2022 7:05 am
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…