నాని ‘అంటే సుందరానికీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ కి పవన్ చీఫ్ గెస్ట్ గా రావడంతో సినిమాపై హైప్ పెరిగింది. ఇక ఈ మధ్య సినిమా ఫంక్షన్ లకు దూరంగా ఉంటూ రాజకీయ పరంగా ప్రజలకు దగ్గరగా ఉంటున్న పవర్ స్టార్ స్పీచ్ ఈవెంట్ కి హైలైట్ గా నిలిచింది. ముందుగా పవన్ నాని గురించి మాట్లాడాడు. నాని నటుడిగా ఇష్టమని అతని వ్యక్తిత్వం అంటే మరింత ఇష్టమని చెప్పాడు.
ఒక రోజు మా చెల్లి హడావుడిగా బయటికి వెళ్తుంది. ఎక్కడికి అని అడిగితే నాని సినిమా చూడ్డాటానికి అంటూ చెప్పింది. సో మా కుటుంబంలో కూడా నానికి ఫ్యాన్స్ ఉన్నారని నానిని ప్రైస్ చేసాడు పవన్. అలాగే ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ పరిశ్రమ ఎవరి సొత్తు కాదని , ఇది అందరికి చెందుతుందని అన్నారు.
కేరళ నుండి నజ్రియా ఇంకో ప్రాంతం నుండి మరొకరు ఇలా టాలెంట్ ఉంటె ఎవరైనా తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు చేసుకోవచ్చని పవన్ అన్నారు. ఇక ఈవెంట్ లో నాని గారు ముందుండాలని నేను వెనుక ఉండాలని అందుకే తన గురించి ఏవి వేయవద్దని చెప్పానని కానీ ఈవెంట్ లో నా ఏవి వేయడం నాకు కోపం తెప్పించిందని కాకపోతే అభిమానుల కోసం వీళ్ళు వేయకతప్పలేదని భావిస్తున్నాని అన్నాడు.
ఇక ఫినిషింగ్ టచ్ గా ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా గురించి కూడా పవన్ మాట్లాడాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి నిర్మాతలతో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా చేస్తున్నాను అంటూ చెప్పాడు పవన్. దీంతో ఈ సినిమాపై ఉన్న రూమర్లు కి కూడా చెక్ పెట్టాడు పవర్ స్టార్.
Gulte Telugu Telugu Political and Movie News Updates