లాక్ డౌన్ ఎత్తివేయాలని, షూటింగ్స్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున పెద్ద దిక్కుగా వెళ్లిన చిరంజీవి అదే ఊపులో ఆచార్య షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ కరోనా విజృంభిస్తూ ఉండడంతో ఆచార్య మొదలు కాలేదు. షూటింగ్ పునఃప్రారంభించి సంక్రాంతికి విడుదల అయ్యేలా చూసుకోవాలనేది అసలు ప్లాన్. కానీ ఇప్పుడా అవకాశం లేదు.
సంక్రాంతికి ఆచార్య రావడం అసాధ్యం. ఆల్రెడీ వచ్చే వేసవికి విడుదల చేసుకుందామని ఇంటర్నల్ గా డిసైడ్ అయినట్టు సమాచారం. ఇకపోతే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని తొలుత భావించినా కానీ ఇప్పుడు సంక్రాంతికి విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్టు తెలిసింది.
సంక్రాంతికి వేరే పెద్ద సినిమాలు ఏవీ ఉండవు కనుక, వకీల్ సాబ్ కి ఇంకా ముప్పై రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండడంతో షూటింగ్ అక్టోబర్ లో జరిగినా కానీ సంక్రాంతికి హ్యాపీగా రావొచ్చు అని, తనకు సంక్రాంతి బాగా కలిసి వచ్చిన సీజన్ కనుక సెంటిమెంట్ గా కూడా దిల్ రాజు అదే డేట్ కి ఫిక్స్ అయ్యారని సమాచారం.
This post was last modified on June 27, 2020 2:09 am
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…