Movie News

లోగుట్టు నిర్మాతలకెరుక..

పెద్ద సినిమాలు రిలీజైనపుడు వాస్తవంగా అవి రాబట్టిన కలెక్షన్ల కంటే.. పోస్టర్ల మీద కనిపించే లెక్కలు చాలా పెద్దవిగా ఉండడం కామనే. ఇది చాలా ఏళ్ల నుంచి నడుస్తున్న ప్రక్రియే. కానీ ఈ మధ్య ఈ వ్యవహారం మరీ శ్రుతి మించి పోతోందనే విమర్శలు పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సరైన కలెక్షన్ ట్రాకింగ్ సిస్టం లేకపోవడంతో ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఫిగర్స్ వేసుకుపోతున్నారు. బాక్సాఫీస్ వెబ్ సైట్లలో ఒక్కోటి ఒక్కో రకంగా వసూళ్ల వివరాలు ప్రకటిస్తున్నాయి.

ఇక నిర్మాతల సంగతి సరేసరి. అసలు సరైన ట్రాకింగ్ చేయకుండా.. డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే నంబర్స్ పట్టించుకోకుండా పెద్ద పెద్ద ఫిగర్స్ వేసేయడం.. తొలి రోజు తర్వాత రోజుకు ఇంత అని కలుపుకుంటూ పోవడం.. ఒక క్రమ పద్ధతిలో కలెక్షన్లు పెంచడం మామూలైపోతోంది. పోస్టర్ల మీద వేసేవి ఒరిజినల్ ఫిగర్స్ కావని సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థం అయిపోయి.. ఈ లెక్కల్ని పట్టించుకోవడమే మానేసే పరిస్థితి వస్తోంది. ఈ మధ్య కాలంలో విడుదలైన రెండు పెద్ద సినిమాల సంగతే తీసుకుంటే.. బ్లాక్‌బస్టర్ బ్లాక్‌బస్టర్ అని ప్రచారం చేసుకున్న ఒక పెద్ద హీరో సినిమాకు చివరికి చూస్తే రూ.20 కోట్ల దాకా నష్టం వచ్చిందట.

ఇది నిర్మాతల మీద పడ్డ భారం. డిస్ట్రిబ్యూటర్లు కూడా వాళ్ల వాళ్ల స్థాయిలో కొంతమేర దెబ్బ తిన్నట్లు సమాచారం. మొత్తంగా ఈ చిత్రం ఏ ఒక్క ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ అవ్వలేదన్నది ఇండస్ట్రీ అంతర్గత వర్గాల మాట. ఆ సినిమాకు రిలీజ్ తర్వాత చిన్న సక్సెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇంకా పెద్ద స్థాయిలో విజయోత్సవ వేడుక ప్లాన్ చేశారు. అందుకోసం షీల్డులు కూడా రెడీ చేసి పెట్టారు. థియేటర్లేమో జనాల్లేక వెలవెలబోతుంటే.. మీడియాలో, సోషల్ మీడియాలో సినిమా బ్లాక్‌బస్టర్ అని ఊదరగొట్టారు. తీరా చూస్తే మిగిలిన నష్టాలు చూసుకుని.. రెడీ చేసిన షీల్డులను అటకెక్కించేశారట. వేడుక రద్దు చేసుకున్నారట. ఇక ఈ మధ్యే వచ్చిన మరో పెద్ద సినిమాకు దాని స్థాయికి మించి బిజినెస్ జరిగింది.

దానికి బ్రాండ్ వాల్యూ బాగా కలిసొచ్చింది. వీకెండ్లో ఈ సినిమా బాగానే సందడి చేసినా.. తర్వాత డల్లయింది. ఇది జస్ట్ బ్లాక్‌బస్టర్ అని కూడా కాకుండా.. ట్రిపుల్ బ్లాక్‌బస్టర్ అని ప్రచారం చేసుకున్నారు. తీరా చూస్తే ఈ సినిమా నష్టం రూ.15 కోట్లకు పైగానే తేలినట్లు సమాచారం. అయినా చిత్ర బృందం తగ్గట్లేదు. కానీ లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్నట్లు.. కలెక్షన్ల గుట్టులన్నీ చివరికి నిర్మాతలకు తెలియకుండా పోవు. పైగా వాళ్లు బ్లాక్‌బస్టర్ అంటూ ముఖాల్లో నవ్వు పులుముకున్నా.. నష్టం తాలూకు బాధ మాత్రం వారి గుండెల్ని మెలిపెడుతూనే ఉంటుంది.

This post was last modified on June 9, 2022 3:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణలో దారుణం.. పట్టపగలే కత్తితో పొడిచి..

తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…

26 minutes ago

రాహుల్ వ‌ర్సెస్ ఖ‌ర్గే.. కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం!

జాతీయ పురాత‌న పార్టీ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌తంగా భారీ క‌ల‌క‌లం రేగిన‌ట్టు తెలుస్తోంది. ఇద్ద‌రు కీల‌క నాయకుల మ‌ధ్య వివాదాలు తార‌స్థాయికి…

45 minutes ago

ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది

గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…

1 hour ago

నిత్యమీనన్ ఆ బయోపిక్ ఎందుకు చేయలేదు?

దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…

2 hours ago

గౌతమ్ మీనన్ షాకింగ్ కామెంట్స్

తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

3 hours ago

‘షా’ మాట‌లు హుష్‌.. బీజేపీ నేత‌లు మార‌రా?

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా నాలుగు రోజుల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించా రు. విజ‌యవాడ…

3 hours ago