అదేదో సామెత చెప్పినట్టు తంతే బూరెల బుట్టలో పడటం అంటే ఇదే. విక్రమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ నేరుగా ఇండియన్ 2 మీద పాజిటివ్ గా ప్రభావం చూపనుంది. షూటింగ్ మొదలైనప్పటి నుంచి పలు అవాంతరాల మధ్య ఆగుతూ సాగుతూ సెట్లో యాక్సిడెంట్ వల్ల కొన్ని ప్రాణాలు తీసుకుంటూ ఫైనల్ గా కామా పెట్టుకున్న ఈ సీక్వెల్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కమల్ స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పేశారు. దర్శకత్వం శంకరే చేస్తారని ఆయన కమిట్మెంట్లు పూర్తయ్యాక వస్తారని అన్నారు.
సో రామ్ చరణ్ తో తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ పూర్తి కాగానే రణ్వీర్ సింగ్ తో చేయాల్సిన అపరిచితుడు రీమేక్ కన్నా ముందు ఈ భారతీయుడు కొనసాగింపు ఉండే అవకాశాలు పెరిగాయి. ఎందుకంటే మొన్నటిదాకా డల్ గా ఉన్న కమల్ హాసన్ మార్కెట్ కు ఒక్కసారిగా ఊపొచ్చింది. వింటేజ్ నాయగన్ వెనక్కు వచ్చేశారని అభిమానులు సంబరపడుతున్నారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ వచ్చే ఏ సినిమా అయినా సరే దాని మీద అంచనాలు బిజినెస్ వేల్యూ ఆటోమేటిక్ గా ఆకాశాన్ని అంటుతాయి. ఇప్పుడదే జరగబోతోంది.
ఊహించని ఈ అవకాశాన్ని లైకా ప్రొడక్షన్స్ తెలివిగా వాడుకోనుంది. దానికి తోడు ఒకవేళ చరణ్ సినిమా కూడా హిట్ అయితే అప్పుడు శంకర్ మళ్ళీ కంబ్యాక్ అయినట్టే. అదీ ఇండియన్ 2కి మేలు చేసేదే. ఇన్ని పాజిటివ్ అంశాల మధ్య వద్దన్నా సరే బజ్ వచ్చేస్తుంది. ఎలాగూ కాజల్ అగర్వాల్ బిడ్డకు జన్మనిచ్చాక ఫ్రీ అయ్యింది. కాల్ షీట్స్ సులభంగా దొరికేస్తాయి. మిగిలిన క్యాస్టింగ్ అందుబాటులోనే ఉంది. ఎటొచ్చి 2023 జనవరి కంటే మెగా మూవీ ఫినిష్ అవ్వదు కాబట్టి అంతకన్నా ముందు రీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేనట్టే.
This post was last modified on June 9, 2022 12:58 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…