థియేటర్లు మూతపడి వంద రోజులు దాటిపోయింది. ఎప్పటికి తెరుచుకుంటాయనేది అసలు అర్ధం కాకుండా ఉంది. దీంతో ఇంతకాలం థియేటర్లలో విడుదల చేయాలని ఉంచిన సినిమాలను ఒక్కోటిగా ఓటిటీలో వదిలేస్తున్నారు. కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయగా స్పందన బాగుంది. దీంతో మరిన్ని చిత్రాలు ఈ బాట పడుతున్నాయి.
రాజ్ తరుణ్ సినిమా ఒరేయ్ బుజ్జిగా డిజిటల్ గా రిలీజ్ అవుతుందని ఎప్పటినుంచో వినిపిస్తోంది. అయితే అది చిన్న చూపుగా భావించి అప్పట్లో ఆ వార్తలను ఖండించారు. కానీ ఇప్పుడు బుజ్జిగాడు పంతం వీడినట్టే ఉన్నాడు. దగ్గర్లో రిలీజ్ కూడా లేకుండా ఈ చిత్రానికి మళ్ళీ ప్రమోషన్ స్టార్ట్ చేసారు.
ఇలా సడన్ గా ప్రమోషన్ మొదలు పెట్టిన సినిమాలన్నీ డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి కనుక ఈ చిత్రానికి ఆ లాంఛనమే మిగిలింది. మరి కొన్ని తెలుగు చిత్రాలు కూడా అతి త్వరలో ఓటిటీ ద్వారా విడుదల కాబోతున్నాయి.
This post was last modified on June 27, 2020 1:56 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…