మొన్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఎక్కడికక్కడ భారీ ఎత్తున జరిగాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని బాలయ్య 107 సినిమా నుండి టీజర్ వస్తుందని అభిమానులు ఊహించారు. కానీ అలాంటిదేం వదలలేదు మేకర్స్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా నుండి ఇంత వరకూ ఎలాంటి గ్లిమ్స్ రిలీజ్ చేయలేదు. షూటింగ్ ప్రారంభంలోనే లీకుల రూపంలో బాలయ్య గెటప్ బయటికొచ్చేయడంతో ఉన్నపళంగా ఫస్ట్ లుక్ వదిలారు. ఇక ఎన్టీఆర్ జయంతి కి టీజర్ అనుకున్నారు కానీ దాన్ని బాలయ్య బర్త్ డే కోసం హోల్డ్ లో పెట్టుకున్నారు.
జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా టీజర్ రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని అండ్ టీం టీజర్ పై వర్క్ చేస్తున్నారు. నిమిషం నిడివితో టీజర్ కట్ చేస్తున్నారని ఇన్సైడ్ టాక్. ‘అఖండ’ కి సంబంధించి కూడా రిలీజ్ కి చాలా నెలల ముందే టీజర్ వదిలారు. ఆ టీజర్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసి మార్కెట్లో హైప్ క్రియేట్ చేసింది. అందుకే ఇప్పుడు అదే విధంగా రిలీజ్ కి ఇంకా టైం ఉన్నప్పటికీ బాలయ్య బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకొని NBK107 గ్లిమ్స్ విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఫస్ట్ హంట్ లోడింగ్ అంటూ నిర్మాతలు ప్రకటన కూడా ఇచ్చారు.
మరి ఎన్టీఆర్ జయంతికి సినిమా టీజర్ రిలీజ్ చేయలేదనే బాధతో ఉన్న బాలయ్య అభిమానులు ఇప్పుడు మేకర్స్ ఇచ్చిన అప్ డేట్ తో సంతోషపడుతున్నారు. NBK107 ఫస్ట్ హంట్ అఖండ టీజర్ రేంజ్ లో మెస్మరైజ్ చేసి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తుందా ? చూడాలి.
This post was last modified on June 7, 2022 10:48 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…