టాలీవుడ్ లో మంచి విజయాలు అందుకొని ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోలు చాలా మంది ఇప్పుడు కనుమరుగైపోయారు. విజయాలు దక్కక కొందరు , ఆఫర్స్ లేక మరికొందరు సినిమాలకు దూరమయ్యారు. ఈ లిస్టులో వేణు తొట్టెంపూడి ఒకరు. వేణు ఒకప్పుడు మంచి హిట్స్ అందుకున్నాడు. ‘స్వయం వరం ‘, చిరునవ్వుతో’,’కళ్యాణ రాముడు’ ఇలా సూపర్ హిట్ సినిమాలు చాలానే చేశాడు. కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ లీడ్ గా కూడా కనిపించాడు. ‘హనుమాన్ జంక్షన్’ లో వేణు కామెడీ ఎప్పుడు గుర్తుచేసుకున్న నవ్వు తెప్పిస్తుంది.
2013 లో రామాచారి అనే సినిమా తర్వాత నటుడిగా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో ఎన్టీఆర్ -బోయపాటి ‘దమ్ము’ తో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. ఆ సినిమా అపజయంతో వేణుకి పెద్దగా కేరెక్టర్స్ దక్కలేదు. ఇక సరైన ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న వేణుకి తాజాగా రవితేజ ‘రామారావు’ సినిమాలో మంచి రోల్ దక్కింది. ఈ సినిమాతో మళ్ళీ యాక్టర్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే హీరోగా మరో ప్రాజెక్ట్ కూడా ఫైనల్ చేసుకున్నాడు వేణు.
వేణు మెయిన్ లీడ్ గా ఒక సినిమా తెరకెక్కబోతుంది. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బేనర్ పై అనురాగ్, శరత్ నిర్మించనున్న ఈ సినిమాకు సూర్య దర్శకుడిగా డెబ్యూ ఇస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మరి లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ హీరోగా సినిమా చేయబోతున్న వేణుకి ఈ ప్రాజెక్ట్ ఎలాంటి విజయం అందిస్తుందో…? మళ్ళీ తన కామెడీ టైమింగ్ తో ఎలా మెప్పిస్తాడో చూడాలి.
This post was last modified on June 7, 2022 10:45 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…