ఎప్పటి నుండో తెలుగు ఆఫర్స్ ని పక్కన పెడుతూ వచ్చింది నజ్రియా. అలాగే ఫహద్ ఫాసిల్ కూడా అన్ని భాషల్లో నటిస్తున్నాడు ఒక్క తెలుగు తప్ప. అయితే ఈ ఇద్దరూ ఒకే సారి తెలుగులో సినిమాలు చేశారు. అందులో ఫహద్ నటించిన పుష్ప రిలీజై తెలుగులో ఫహద్ కి ఇంకా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు నజ్రియా వంతు. ఆమె హీరోయిన్ గా నటిస్తున్న తెలుగు సినిమా ‘అంటే సుందరానికీ’ జూన్ 10న విదులవుతోంది.
ఇప్పటికే రాజా రాణి (డబ్బింగ్) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నజ్రియా నాని సినిమాతో ఇప్పుడు మరింత దగ్గరవ్వనుంది. అయితే తాజాగా ‘అంటే సుందరానికీ’ ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన నజ్రియా కి తెలుగులో ఇప్పటి వరకూ సినిమాలు చేయని మీరు ఫహద్ ఒకేసారి సినిమాలు సైన్ చేసి ఫినిష్ చేశారు. ఇది కో ఇన్సిడెంటా ? లేక ప్లానింగ్ ఆ? అనే ప్రశ్న ఎదురైంది.
దానికి నజ్రియా అంత మైత్రి వాళ్ళే చేశారంటూ నవ్వుతూ చెప్పుకుంది. ముందుగా నన్ను ఈ సినిమా కోసం అప్రోచ్ అయ్యారు. వెంటనే పుష్ప కోసం ఫహద్ ని అప్రోచ్ అయ్యారు. మేమేమి ప్లాన్ చేసుకోలేదు. తెలుగులో మంచి కథల కోసం ఎదురుచూస్తున్న సమయంలో మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో ఈ రెండు సినిమాలు వచ్చాయంటూ చెప్పుకుంది.
ఇక వివేక్ ఆత్రేయ నెరేషన్ ఇచ్చే విధానం అలాగే అతని మేకింగ్ స్టైల్ బాగా నచ్చిందని ఫ్యూచర్ లో ఎప్పుడైనా నా డేట్స్ కావాలంటే ఏ మాత్రం ఆలోచించకుండా ఇచ్చేస్తానని వివేక్ మీద అంత నమ్మకం కలిగిందని తెలిపింది. మరి మల్లుబ్యూటీ ఈ సినిమాతో తెలుగులో ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో తెలుగు ప్రేక్షకుల నుండి ఎలాంటి కాంప్లిమెంట్స్ దక్కించుకుంటుందో చూడాలి.
This post was last modified on June 7, 2022 5:15 pm
దేశంలో వందల సంఖ్యలో పార్టీలు ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ, ఏ పార్టీ చేయని పని..…
అతడులో తనికెళ్ళ భరణి చెప్పే ఫేమస్ డైలాగు ఒకటుంది. బ్రహ్మాజీతో మాట్లాడుతూ ఇన్ని బళ్ళు ఎందుకురా బుజ్జి అంటాడు. బాలీవుడ్…
ఇప్పటి మన జీవిత విధానం చాలా వేగంగా మారిపోయింది. ఏదైనా తినాలనిపిస్తే కేవలం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే సరిపోతుంది. కొన్ని…
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…