యాక్షన్ కింగ్ అర్జున్ కెరీర్లో టాప్ 1గా నిలిచే చిత్రం జెంటిల్ మెన్. శంకర్ అనే దర్శకత్వ అద్భుతం సౌత్ తో పాటు దేశం మొత్తానికి పరిచయమయ్యింది దీంతోనే. 1993లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ని ఆధారంగా చేసుకుని ఆ తర్వాత ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కబెట్టడం కష్టం. దీన్నే ఏరికోరి మరీ చిరంజీవి హిందీలో అదే టైటిల్ తో రీమేక్ చేసుకోవడం మెగా ఫ్యాన్స్ మర్చిపోలేరు. ఒరిజినల్ వెర్షన్ మేజిక్ ని రిపీట్ చేయలేక మహేష్ భట్ అంతటి గొప్ప డైరెక్టరే ఫ్లాప్ మూటగట్టుకోవాల్సి వచ్చింది. అంతటి చరిత్ర దీనిది.
ఇక నిర్మాత కెటి కుంజుమోన్ గురించి చెప్పేదేముంది. బడ్జెట్ పరంగా గిరిగీసుకుని పరిమితులు పాటించే నిర్మాణానికి స్వస్తి చెప్పి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కంటెంట్ పర్ఫెక్ట్ గా రిచ్ గా ఉంటే జనం బ్రహ్మాండంగా ఆదరిస్తారని నిరూపించిన ప్రొడ్యూసర్ ఆయన. తర్వాత ప్రేమదేశం లాంటి బ్లాక్ బస్టర్లు ఆయన్నుంచి వచ్చాయి. నాగార్జున రక్షకుడు హైప్ గురించి ఇప్పటికీ ఫ్యాన్స్ చెప్పుకుంటారు. కానీ స్వంత కొడుకుతో కోటీశ్వరుడు సినిమా చేయబోయి ఖర్చు మితిమీరిపోయి చేత్తులెత్తేసిన కుంజు మోన్ చాలా గ్యాప్ తీసుకున్నారు.
ఇన్నేళ్ల తర్వాత జెంటిల్ మెన్ కి సీక్వెల్ రాబోతోంది. శంకర్ ఇండియన్ 2తో పాటు ఇతర ప్రాజెక్టులలో బిజీగా ఉండటంతో దీని దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారా అనే సస్పెన్స్ కొనసాగింది. ఫైనల్ గా ఏ గోకుల్ కృష్ణని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇతను ఇప్పటిదాకా తీసింది ఒకే సినిమా. నాని ఆహా కళ్యాణం దర్శకుడు గోకుల్ కృష్ణే. బాలీవుడ్ మూవీ బాండ్ బాజా బారత్ రీమేక్ అది. డిజాస్టర్ అయ్యింది. మళ్ళీ ఇంకోటి తీయనేలేదు. ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి డైరెక్టర్ క్యాప్ పెట్టుకోబోతున్న గోకుల్ కృష్ణ జెంటిల్ మెన్ 2 ఎలా హ్యాండిల్ చేస్తాడో మరి. దీనికి కీరవాణి సంగీతం అందిస్తుండగా హీరో అర్జునా ఇంకెవరైనా అనేది రివీల్ చేయలేదు
This post was last modified on June 7, 2022 7:15 am
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…