ఆహా ఓటీటీ ని ఉన్నపళంగా జనాలకి బాగా దగ్గర చేసి భారీ సబ్ స్క్రైబర్స్ రాబట్టిన షో ‘అన్ స్టాపబుల్’. నందమూరి బాలకృష్ణ మొదటి సారి ఓ టాక్ షో హోస్ట్ చేయడం , పైగా స్టార్ హీరోలతో ఎపిసోడ్స్ చేసి వారి నుండి పాత సంగతులు, కొత్త విషయాలు రాబట్టడంతో అన్ స్టాపబుల్ ఊహించని విధంగా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నిజానికి డబ్బింగ్ సినిమాలతో ‘ఆహా’ రాబట్టలేకపోయిన కొత్త సబ్ స్క్రైబర్స్ తెచ్చిపెట్టిన ఏకైక షో ఇదే.
ఇంతటి సక్సెస్ సాధించిన ఈ షోని వెంటనే సీజన్ 2 గా కంటిన్యూ చేయాలి కానీ ఆహా టీం మాత్రం ఇంకా ప్లానింగ్ లోనే ఉన్నారు. సీజన్ 2 కూడా బాలయ్యతోనే చేయిస్తారని తెలుస్తుంది. బాలయ్య కూడా రెండో సీజన్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. కానీ అన్ స్టాపబుల్ సీజన్ 2 గురించి మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు ఆహా.
మొదటి సీజన్ సక్సెస్ అవ్వగానే రెండో సీజన్ కి ఎక్కువ టైం తీసుకోకుండా వెంటనే స్టార్ట్ చేయాలి. అలా కాకుండా గ్యాప్ ఇస్తే బాలయ్య షో కోసం వచ్చిన వ్యూవర్స్ మెల్లగా అన్ సబ్ స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంది. తాజాగా ‘ఆహా’ సబ్ స్క్రైబర్స్ కౌంట్ తగ్గిందని తెలుస్తుంది. అందుకే రేటు కూడా తగ్గించి మళ్ళీ ప్రమోషన్ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ ఓటీటీ ఫ్లాట్ ఫాం కొత్త సినిమాలతో ముందుకు నడుస్తుంది తప్ప కొత్త సబ్ స్క్రైబర్స్ ని పొందాలంటే మాత్రం మళ్ళీ బాలయ్య షో అలాగే మరిన్ని షోలు స్టార్ట్ చేయాల్సి ఉంది.
This post was last modified on June 6, 2022 5:06 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…