ఎప్పుడో 1993లో జురాసిక్ పార్క్ సినిమా వచ్చినప్పుడు అందరూ దాన్నో అద్భుతంలా చూశారు. అప్పటిదాకా భారతీయులకు అంతగా పరిచయం లేని దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్ పేరు మారుమ్రోగిపోయింది. కేవలం ఇంగ్లీష్ వెర్షనే తెలుగు రాష్ట్రంలో వంద రోజులు ఆడటం రికార్డుగా చెప్పుకునేవారు. డాల్బీ సౌండ్ లు, 4K రెజొల్యూషన్లు ఏమి లేని మాములు థియేటర్లలో కూడా ఇది లక్షలాది వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. నిజానికి అక్కడి నుంచే హాలీవుడ్ మూవీస్ కి ఇండియాలో మార్కెట్ పెరిగిందని చెప్పాలి.
తర్వాత ఈ సిరీస్ లో చాలా సినిమాలొచ్చాయి. ఇతర దర్శకులు తెరకెక్కించారు. విజయాలు అందుకున్నారు. ది లాస్ట్ వరల్డ్, జురాసిక్ పార్క్ 3, జురాసిక్ వర్డ్, జురాసిక్ వరల్డ్ 2 ఫాలెన్ కింగ్ డం తర్వాత ఇప్పుడు చివరి అంకం జురాసిక్ వరల్డ్ డామినియన్ జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మన దేశంలో ఒక రోజు ముందే అంటే 9నే ప్రీమియర్లు పడబోతున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో నెల రోజుల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ పెట్టగా టికెట్ల అమ్మకాలు జోరుగా ఉంటున్నాయి.
నిర్మాణ సంస్థ యునివర్సల్ పిక్చర్స్ ఇది లాస్ట్ పార్ట్ అని అధికారికంగా ప్రకటించింది. అంటే ఇకపై ఈ లెగసీ కొనసాగదు. దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ దీని క్రేజ్ తగ్గకపోవడం విశేషం. జురాసిక్ పార్క్ మొదటిసారి రిలీజైనప్పుడు యువకులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు వయసైపోయి రిటైర్ అయ్యారు. అయినా కూడా దీన్ని ఇంతగా ఇష్టపడే న్యూ జనరేషన్ కిడ్స్ ఉండటం చూస్తే స్పీల్బర్గ్ సృష్టించిన సామ్రాజ్యం ఎంత గొప్పదో అర్థమవుతుంది. మరి సెలవు తీసుకోబోతున్న డైనోసార్లు ఈసారి ఎలాంటి భయాన్ని చూపిస్తాయో చూడాలి.
This post was last modified on June 6, 2022 4:00 pm
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…
మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…