‘శ్యామ్ సింగ రాయ్’ రిలీజ్ కి ముందు నాని ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేటుపై స్పందిస్తూ ఇచ్చిన స్పీచ్ హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత వైఎస్ ఆర్ సి పీ పార్టీ నాయకులు నానిని గట్టిగా త్రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి సినిమా రేటు పై కామెంట్ చేశాడు నాని. అప్పుడు టికెటు రేటు పెంచమన్నావ్ ఇప్పుడు బాగా పెరిగాయి బాగుందా ? అంటూ సోషల్ మీడియాలో తనని కొందరు ట్యాగ్ చేశారని నిజానికి సోషల్ మీడియాలో కామెంట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఎవరో ఒకరి ఒపినియన్ తీసుకొని దాన్నే మళ్ళీ కాపీ చేస్తూ పెట్టుకుంటారని అసలు మేటర్ అర్థం చేసుకోరని అన్నాడు.
అప్పట్లో నేను అడిగినప్పుడు మరీ ముప్పై , నలబై , యాబై రేటు ఉందని ఆ రేటుతో సినిమా వాళ్ళకి నష్టమని దాన్ని పట్టుకొని ఇప్పుడు ఈ రేటుకి లింక్ చేసి కామెంట్ చేయడం కరెక్ట్ కాదని, అప్పుడు అది తప్పైతే ఇప్పుడు ఇది కూడా తప్పే అని ఇంత రేటు కూడా ఉండకూడదని మీడియం రేట్లతో థియేటర్స్ కొనసాగిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. RRR లాంటి సినిమాలకు ఈ రేటు ఓకె కానీ మిగతా సినిమాలకు ఈ రేటు అస్సలు కరెక్ట్ కాదని అన్నాడు.
ఇక మొన్నీ మధ్య హీరో నాని గురించి రెండు వార్తలు వినిపించాయి. విజయ్ తో వంశీ పైడిపల్లి తీస్తున్న సినిమాలో నాని స్పెషల్ రోల్ అనేది అందులో ఒక వార్త కాగా మరొకటి మహేష్ -త్రివిక్రమ్ సినిమాలో నాని ఓ కేరెక్టర్ ప్లే చేయబోతున్నాడనేది ఇంకో వార్త. ఈ రెండు వార్తలు సోషల్ మీడియాలో పుట్టినవే. తర్వాత మీడియాలో కథనాలుగా మారాయి.
ఈ సినిమాలపై కూడా క్లారిటీ ఇచ్చేశాడు నాని. ఆ సినిమాల్లో తను నటించడం లేదని అవన్నీ రూమర్లే అంటూ కొట్టి పారేశాడు. తనకి కూడా సోషల్ మీడియా ద్వారానే ఈ వార్తలు కనిపించాయని చెప్పుకున్నాడు. ఇలాగే కంటిన్యూ అయితే తన సినిమా ఎనౌన్స్ చేసినా రూమర్ అనుకుంటారేమో అంటూ జోకేశాడు. తాజాగా అంటే సుందరానికి మీడియా మీట్ లో నాని ఆ కేరెక్టర్స్ పై ఇలా తన దైన స్టైల్ లో క్లారిటీ ఇచ్చాడు.
This post was last modified on June 6, 2022 3:56 pm
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…