Movie News

తమన్నాతో గొడవ క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి

కొన్ని సినిమాల సెట్స్ లో డైరెక్టర్ కి అలాగే యాక్టర్స్ కి మధ్య చిన్న చిన్న ఇష్యూస్ వస్తుంటాయి. తాజాగా ఎఫ్ 3 విషయంలో కూడా తమన్నా కి మేకర్స్ కి ఏదో గొడవ జరిగిందనే వార్త బయటికొచ్చింది. అందుకే తమన్నా ప్రమోషన్స్ లో కనిపించడం లేదని ఓ వార్త చక్కర్లు కొట్టింది. అయితే ఈ విషయంపై తాజాగా దర్శకుడు అనీల్ రావిపూడి స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో తమన్నా తో గొడవ గురించి క్లారిటీ ఇచ్చాడు.

నిజానికి ‘ఎఫ్ 3’ చాలా మంది ఆర్టిస్టులతో తీసిన సినిమా. ప్రతీ రోజు చాలా మంది ఆర్టిస్టులు సెట్స్ లో ఉండేవారు. ఇక కాంబినేషన్ సీన్స్ అంటే ఎవరొకరు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇచ్చిన టైం కంటే ఇంకాస్త ఎక్కువ పట్టొచ్చు. ఎఫ్ 3 షూటింగ్ లో ఒక రోజు మిగతా ఆర్టిస్టుల కాంబినేషన్ లో తమన్నా ఓ సీన్ చేయాల్సి ఉంది. అయితే అప్పటికే టైం అయిపోయిందని ఉదయాన్నే జిమ్ కి వెళ్లాలని తను వెళ్లిపోతానని ఖరాకండిగా చెప్పేసిందట. దాంతో అనిల్ రావిపూడి తమన్నాకి మధ్య చిన్న కన్వర్సేషణ్ జరిగిందట. రెండు మూడు రోజులు సెట్స్ లో ఈ ఇద్దరు ఎడముఖం పెడముఖం పెట్టుకున్నారట. కానీ మళ్ళీ అంతా సెట్ అయిపోయిందని అనిల్ రావిపూడి చెప్పుకున్నాడు. ఇక సినిమా ప్రమోషన్స్ లో తమన్నా కనిపించకపోవడానికి రీజన్ ఆమె మరో సినిమా షూటింగ్ లో బిజీగా ఉందని అందుకే రాలేదని తెలిపాడు.

అనిల్ చెప్పిన ఈ విషయంతో ఎఫ్ 3 ప్రమోషన్స్ లో తమన్నా ఎందుకు కనిపించలేదనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఇక ఎఫ్ 4 లో హీరోయిన్స్ ని రిపీట్ చేయనని 90 % వాళ్ళు ఉండకపోవచ్చని అనిల్ అన్నాడు. వెంకీ , వరుణ్ లతో పాటు ఈసారి మరో హీరో కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నామని రెండు సినిమాల తర్వాత మళ్ళీ ఎఫ్ 4 ఫ్రాంచైజీ చేస్తానని చెప్పుకున్నాడు.

This post was last modified on June 6, 2022 11:05 am

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

42 minutes ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

3 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

5 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

10 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

11 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago