పృథ్వీరాజ్.. బాలీవుడ్లో తెరకెక్కిన మరో భారీ చిత్రం. యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ప్రొడక్షన్లో అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరో నటించిన చిత్రమిది. మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ కథానాయికగా పరిచయం అయిన ఈ చిత్రంలో సంజయ్ దత్, సోనూ సూద్ ముఖ్య పాత్రలు పోషించారు. బాజీరావు మస్తానీ, పద్మావత్ తరహాలో చారిత్రక కథకు భారీ తారాగణం, సెట్టింగ్స్ జోడించి ఈ చిత్రాన్ని పెద్ద స్థాయిలో తీర్చిదిద్దారు.
ఐతే ఒకప్పుడైతే ఈ సినిమా బాగా ఆడేదేమో కానీ.. బాలీవుడ్ సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ, ప్రేక్షకుల తిరస్కారానికి గురవుతున్న బ్యాడ్ టైమింగ్‌లో రిలీజ్ కావడం ప్రతికూలంగా మారినట్లుంది. అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గరే తుస్సుమనిపించిన ‘పృథ్వీరాజ్’.. రిలీజ్ తర్వాత కూడా పుంజుకోలేకపోయింది. సినిమాకు మరీ గొప్ప టాక్ రాలేదు. అలాగని తీసిపడేసేలా లేదు. దీనికి తగ్గట్లే వసూళ్లు కూడా ఉన్నాయి.
తొలి రోజు రూ.10.5 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన ‘పృథ్వీరాజ్’.. రెండో రోజు కూడా అదే స్థాయిలో కలెక్షన్లు తెచ్చుకుంది. మామూలుగా చూస్తే ఇవి డీసెంట్ కలెక్షన్లు అనుకోవాలి. కానీ అక్షయ్ కుమార్ హీరో, ఇంత భారీతనం ఉన్న సినిమాకు ఈ వసూళ్లు సరిపోవు. దీని మీద నిర్మాతలు, బయ్యర్లు పెట్టిన పెట్టుబడికి, వస్తున్న వసూళ్లకు పొంతన లేదు. వంద కోట్లకు పైగా నెట్ వసూళ్లు వస్తే తప్ప ఇది బ్రేక్ ఈవెన్ అవ్వదు. కానీ వీకెండ్లోనే అంతంతమాత్రంగా ఉన్న వసూళ్లు.. తర్వాత పుంజుకుంటాయనే ఆశ కనిపించడం లేదు.
సోమవారం నుంచి వసూళ్లలో మేజర్ డ్రాప్ ఖాయంగా కనిపిస్తోంది. ఓవరాల్‌గా ఈ సినిమా ఎపిక్ డిజాస్టర్ అయ్యేలా కనిపిస్తోంది బాలీవుడ్ పెద్ద హీరోలు నటించిన హిందీ చిత్రాలను అక్కడి ప్రేక్షకులు వరుసగా ఇలా తిరస్కరిస్తుండటం అక్కడి ఇండస్ట్రీ జనాలను బెంబేలెత్తిస్తోంది. మున్ముందు ఏం జరుగుతుందో అన్న భయాన్ని పెంచుతోంది. ఓవైపు సౌత్ సినిమాలు మేజర్, విక్రమ్ అదరగొడుతుండగా.. ‘పృథ్వీరాజ్’కు ఇలాంటి పరిస్థితి రావడం వారికి విస్మయాన్ని కలిగిస్తోంది.
This post was last modified on June 5, 2022 7:41 pm
టాలీవుడ్ కు అత్యంత కీలకమైన సంక్రాంతి పండగ అయిపోయింది. నిన్నటితో సెలవులు పూర్తయిపోయాయి. బాక్సాఫీస్ విజేతగా ఒక్క శాతం అనుమానం…
ఇటీవలే ముగిసిన సంక్రాంతి సంబరాల్లో ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున కోడి పందేలు జరిగాయి. ఈ పందేలను…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం 55వ వార్షిక సదస్సులు సోమవారం దావోప్ లో ప్రారంభం కానున్నాయి. దాదాపుగా విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని…
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొందలేక, పదేళ్ల పాటు అధికారానికి…
సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ…