అదేంటి ఏదో న్యూస్ ఛానల్స్ లో రావాల్సిన పెళ్లి వేడుక ఓటిటికి ఇవ్వడమేంటని షాక్ అయ్యారా. నిజమేనండోయ్. ఈ నెల 9న ఒక్కటి కాబోతున్న నయనతార విజ్ఞేశ్ శివన్ ల వివాహాన్ని నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. లైవ్ ఇస్తారా లేక మొత్తం షూట్ చేసి సినిమాలాగా ప్రెజెంట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మహాబలిపురంలో ఇది జరగనుందని సమాచారం. ఆ తర్వాత తిరుమలకు వెళ్లి ఏడుకొండల వాడి ఆశీర్వాదం తీసుకోబోతున్నారట. ఇదంతా కవరేజ్ లో భాగంగా చూడొచ్చని చెన్నై మీడియా టాక్.
దీనికి గౌతమ్ మీనన్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారని తెలిసింది. ఆ మధ్య ఈయనే తెలంగాణ ప్రభుత్వం కోసం బతుకమ్మ పాటని తీసిన సంగతి గుర్తే. పెద్దగా హిట్టవ్వలేదు కానీ పిక్చరైజేషన్ కు పేరు వచ్చింది. ఇప్పుడు నయన్ వెడ్డింగ్ తాలూకు షూట్ మొత్తం తన కంట్రోల్ లోకి తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ ఈవెంట్ గా దీని కోసం అభిమానులతో పాటు మీడియా సగటు సినీ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో నయన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.
ఏళ్ళ తరబడి నాన్చిన ప్రేమకథకు ఎట్టకేలకు ఈ జంట శుభం కార్డు పలికింది. రిసెప్షన్ ఎక్కడ చేస్తారు, వేదిక, రాబోతున్న ప్రముఖులు తదితర వివరాలు ఇంకా బయటికి రాలేదు. ప్రస్తుతం నయనతార తెలుగులో గాడ్ ఫాదర్ చేసింది. చిరంజీవి సరసన జోడిగా కాకపోయినా చాలా కీలకమైన పాత్ర కోసం భారీ రెమ్యునరేషన్ అందుకుంది. ఇక విజ్ఞేశ్ శివన్ లేటెస్ట్ మూవీ కన్మణి రాంబో కతిజ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. నయనతారతో పాటు సమంతా, విజయ్ సేతుపతిలు ఉన్న ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని జనం తిరస్కరించారు
This post was last modified on June 5, 2022 2:22 pm
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…