Movie News

నాలుగోసారి జోడి కట్టనున్న సామ్

నాగచైతన్యతో విడాకులు తీసుకున్నాక కెరీర్ స్లో అవుతుందేమోనన్న అంచనాలకు భిన్నంగా సమంత వరస సినిమాలతో దూసుకుపోతోంది. ఒకపక్క పీరియాడిక్ డ్రామా శాకుంతలం, యశోద లాంటి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మరోపక్క క్రేజ్ ఉన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఖుషిలోనూ తనకు జోడిగా ఛాన్స్ కొట్టేసింది. పుష్ప పార్ట్ 1 లో చేసిన ఊ అంటావా ఊహూ అంటావా ఐటెం సాంగ్ తెచ్చిన పాపులారిటీ చిన్నది కాదు. ఇప్పటికీ తనకు స్టార్ హీరోల సరసన ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి.

ఇటీవలే విక్రమ్ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందబోయే విజయ్ 67వ సినిమాలో సామ్ హీరోయిన్ గా లాక్ అయినట్టు కోలీవుడ్ టాక్. ఇప్పటికి ఈ జంట మూడుసార్లు కనువిందు చేసింది. కత్తి ఆల్ టైం బ్లాక్ బస్టర్ కాగా తేరి అప్పటిదాకా ఉన్న రికార్డులను తుడిచిపెట్టింది. మెర్సల్ హిట్టు రేంజ్ గురించి తెలిసిందే. మొదటిది మినహాయించి మిగిలిన రెండూ తెలుగులోనూ డబ్ అయ్యాయి. పోలీసోడు పెద్దగా ఆడలేదు కానీ అదిరింది కమర్షియల్ గా సేఫ్ ప్రాజెక్ట్ అనిపించుకుంది.

వీటిలో ఒక్క ఫ్లాప్ లేదు. అందుకే నాలుగోసారి కాంబో అనగానే ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఇంకా అఫీషియల్ నోట్ రాలేదు కానీ సామ్ సైన్ చేసినట్టు తెలిసింది. విజయ్ ని ఆల్రెడీ మాస్టర్ తో డీల్ చేసిన లోకేష్ కనగరాజ్ అంతకు పదింతలు కొత్త సినిమాలో చూపిస్తానని హామీ ఇస్తున్నాడు. సో సామ్ కు మరో భారీ హిట్టు ఖాయం. పైన చెప్పిన సినిమాలతో పాటు ఒక హాలీవుడ్ మూవీ, ఫ్యామిలీ మ్యాన్ 2 డీల్ చేసిన రాజ్ అండ్ డికె దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సామ్ డైరీ మరో రెండేళ్ల దాకా ఖాళీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

This post was last modified on June 5, 2022 2:20 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

22 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago