Movie News

జూనియ‌ర్ ఎన్టీఆర్‌ పై తార‌క‌ర‌త్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రెండు ద‌శాబ్దాల కింద‌ట‌ ఒకేసారి తొమ్మిది సినిమాల ఓపెనింగ్‌తో సంచ‌ల‌నం రేపిన న‌టుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న‌. కానీ అలా ప్రారంభించిన తొమ్మిది సినిమాల్లో కొన్ని మొద‌లే కాలేదు. కొన్ని పూర్తయినా విడుద‌ల‌కు నోచుకోలేదు. రిలీజైన‌వి ఏవీ ఆడ‌లేదు. ఆ తర్వాత తారకరత్న ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఏవీ ఫలితాన్నివ్వలేదు. విలన్ పాత్రలు చేసినా కూడా నిరాశ తప్పలేదు. కొన్నేళ్ల నుంచి అసలు అతడి పేరే వినిపించలేదు.

ఐతే ఇప్పుడు ‘9 అవర్స్’ అనే వెబ్ సిరీస్‌తో మళ్లీ ప్రేక్షకులను పలకరించాడు తారకరత్న. ఈ సందర్భంగా మీడియాను కలిసిన అతను కొన్ని ఆసక్తికర విషయాలపై ప్రశ్నలకు బదులిచ్చాడు. త్రివిక్రమ్-మహేష్ బాబు సినిమాలో విలన్ పాత్ర చేయబోతున్నట్లు జరిగిన ప్రచారం గురించి స్పందిస్తూ.. తన పేరిట ఎవరో ఫేక్ అకౌంట్ తెరిచి ఈ రూమర్‌‌తో అందరినీ కన్ఫ్యూజ్ చేశారని, తాను అసలు సోషల్ మీడియాలో ఎక్కడా లేనని తారకరత్న మరోసారి స్పష్టం చేశాడు. నిజంగా మహేష్ సినిమాలో విలన్ పాత్ర చేసే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తానని అతనన్నాడు.

ఇక జూనియర్ ఎన్టీఆర్‌కు పోటీగానే మిమ్మల్ని నందమూరి ఫ్యామిలీ సినిమాల్లోకి తీసుకొచ్చిందా అని అడిగితే.. “తమ్ముడు ఎన్టీఆర్ తర్వాత నేను సినిమాల్లోకి వచ్చాను. అప్పటికే తమ్ముడికి ‘ఆది’ లాంటి సినిమాలు హిట్ వచ్చాయి. నేను తారక్‌కు కాంపిటీషన్ కాదు. నేను ఎప్పుడు అలా ఫీల్ కాలేదు. అతను గ్రేట్ ఆర్టిస్ట్. మేమంతా నందమూరి బిడ్డలం. ఈరోజు నందమూరి ఫ్యామిలీ పేరు నిలబడుతోంది అంటే ఎన్టీఆర్ కూడా ఒక కారణం. ఎన్టీఆర్‌కు కాంపిటీషన్‌గా లాంచ్ చేశారనేది పూర్తిగా తప్పు. హీరో కావాలనేది నా డ్రీమ్. దానికి మా నాన్నగారు, బాబాయ్ సపోర్ట్ చేసి ఒకే అన్నారు. ఎన్టీఆర్‌కు కాంపిటీషన్‌గా ఏ రోజు లేదు. అప్పటి నుంచే ఈ విషయంపై క్లారిటీ ఇద్దామని అనుకున్నా. 2002 నుంచే ఈ ప్రచారం జరుగుతూనే ఉంది. తమ్ముడు నాకు ఎప్పుడు కాంపిటీషన్ అని ఫీల్ అవ్వలేదు. ఎవరు ముందుకు వెళ్లినా.. నందమూరి ఫ్యామిలీనే ముందుకు వెళుతుంది. తమ్ముడు ఎన్టీఆర్ తీసుకువెళ్లినా.. అన్న కళ్యాణ్ రామ్ తీసుకువెళ్లినా నాకు సంతోషమే. అందుకే ఏరోజు కూడా నేను పోటీగా భావించలేదు” అని తారకరత్న స్పష్టం చేశాడు.

This post was last modified on June 5, 2022 2:20 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

29 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago