ఇప్పుడేదైనా సినిమాను విడుదల చేయడం కన్నా దాన్ని ఓ మూడు నాలుగు వారాల పాటు థియేటర్లలో స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకోవడం నిర్మాతలకు సవాల్ గా మారుతోంది. ఒకపక్క టికెట్ రేట్ల పంచాయితీ, మరోపక్క ఓటిటిలో ఎర్లీ యాక్సెస్ పేరుతో తక్కువ వ్యవధిలో డిజిటల్ ప్రీమియర్లు , ఇంకోవైపు జనం ఎలాంటి చిత్రాలను ఇష్టపడుతున్నారో అర్థం కాని అయోమయం. ఒకప్పుడు ఈ ఒత్తిడిని ప్రొడ్యూసరే భరించేవాడు. ఇప్పుడు స్టార్ హీరోలు తమ స్టేటస్ ని ఈగోలను పక్కనపెట్టి పబ్లిసిటీ కోసం ముందుకొస్తున్నారు.
ఆ మధ్య సర్కారు వారి పాట సక్సెస్ మీట్ కర్నూలులో జరిగినప్పుడు మహేష్ బాబు మొదటిసారి స్టేజి మీద డాన్స్ చేయడం చూసి ఫ్యాన్స్ ఆనందంతో కూడిన షాక్ తిన్నారు. చక్కగా మాట్లాడ్డం తప్ప ఇలాంటి వ్యవహారాల్లో రిజర్వ్డ్ గా ఉండే మహేష్ అంత ఓపెన్ గా తమన్ తో కలిసి కాలు కదపడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. నిన్న వైజాగ్ ఎఫ్3 విజయోత్సవ వేడుకలో విక్టరీ వెంకటేష్ కుర్రాడు బాబోయ్ సాంగ్ బిట్ కి ఫుల్ జోష్ తో నృత్యం చేయడం యువకుడైన వరుణ్ తేజ్ ని సైతం వెనక్కు నెట్టింది.
ఇదంతా సక్సెస్ ఇచ్చిన కిక్ కావొచ్చు లేదా జనంలోకి సినిమాను మరింత బలంగా తీసుకెళ్లాలన్న తాపత్రయం కావొచ్చు. ఏదైతేనేం స్క్రీన్ బయట కూడా హీరోలు ఇలా వినోదాన్ని పంచడం హర్షించదగ్గ విషయం. అప్పుడెప్పుడో 2007లో జరిగిన తెలుగు సినిమా వజ్రోత్సవాల్లో చిరంజీవి బాలకృష్ణ సహా దాదాపు హీరోలందరూ స్టేజి మీద అదిరిపోయే స్థాయిలో రచ్చ చేశారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇలా మహేష్ వెంకీలు హుషారునివ్వడం చూస్తుంటే ఇకపై మిగిలినవాళ్లు కూడా అదే దారిలో వెళ్లినా ఆశ్చర్యం లేదు.
This post was last modified on June 5, 2022 2:19 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…