ఇంకో 13 రోజుల్లో రాబోతున్న విరాట పర్వం మీద భారీ హైప్ లేదు కానీ ఉన్నంతలో బజ్ పెంచేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు. అందులో భాగంగానే రేపు సాయంత్రం కర్నూలు వేదికగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇవాళ వదిలిన చిన్న వీడియో బైట్ లో ఒక ఫ్యాన్ తో కలిసి రానా చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో టాపిక్ గా మారాయి. అందులో ఆ అభిమాని అడిగిన ప్రశ్నకు సాయిపల్లవి కోసమే ఈ సినిమా తీశామన్నట్టుగా రానా బదులు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది.
అంటే ఆమె పేరు చెబితేనే విరాటపర్వంకు పబ్లిసిటీ వస్తుందానే తరహాలో దగ్గుబాటి ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామాలో చెప్పుకోవడానికి బలమైన కంటెంట్ ఉంది. నందితా దాస్, ప్రియమణి లాంటి టాలెంటెడ్ సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. దర్శకుడు వేణు ఊడుగుల చాలా పరిశోధన చేసి అప్పటి వాస్తవ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. బలమైన సంగీత సాహిత్యాలను సమకూర్చుకున్నారు. ఇన్ని ఉన్నా ఒక్క అంశం మీదే ఫోకస్ పెడుతున్నారు.
నిజానికి లవ్ స్టోరీ టైంలోనూ సాయిపల్లవి బ్రాండ్ చాలా ప్లస్ అయ్యింది. బిసి సెంటర్లలో నాగచైతన్యతో పాటు ఈమెకూ కటవుట్లు బ్యానర్లు పెట్టడం, ఆ ఫోటోలు ట్విట్టర్ లో వైరల్ కావడం అందరూ చూశారు. నిన్న వదిలిన విరాటపర్వం పోస్టర్ లోనూ సాయిపల్లవిని స్పష్టంగా చూపించి రానా మొహం మాత్రం కవర్ చేశారు. అసలే కమర్షియల్ ఎలిమెంట్స్ లేని రిస్కీ డ్రామా ఇది. అలాంటిది ఒక పాయింట్ ని హైలైట్ చేయడం వల్ల అంచనాలు పక్కదారి పట్టే ఇబ్బంది లేకపోలేదు. మరి సురేష్ టీమ్ స్ట్రాటజీ ఏంటో.
This post was last modified on June 4, 2022 6:41 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…