ఒకప్పుడు తమిళ సినిమాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు ఉండేది. వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు తీస్తూ.. పెద్ద హీరోల సినిమాల్లో సైతం కొత్తదనం చూపిస్తూ.. మిగతా ఫిలిం ఇండస్ట్రీలన్నింటికీ అది ఆదర్శంగా ఉండేది. ఓవైపు తెలుగులో రొటీన్ మాస్ మసాలా సినిమాలు వస్తుంటే.. మరోవైపు తమిళంలో అద్భుతమైన సినిమాలు తెరకెక్కడం చూసి ఇక్కడి హీరోలు, దర్శకులను మన ప్రేక్షకులు విమర్శించేవాళ్లు. తమిళోళ్లను చూసి నేర్చుకోవాలని అనేవారు. కానీ గత కొన్నేళలో పరిస్థితి మొత్తం మారిపోయింది. తమిళ సినిమాల క్వాలిటీ పడిపోయింది. కొత్తదనం అటకెక్కింది.
శంకర్, మురుగదాస్ సహా చాలామంది టాప్ డైరెక్టర్లు ఫాం కోల్పోయారు. ఎప్పుడో కానీ ఒక మంచి సినిమా రాని పరిస్థితి తలెత్తింది. దీంతో అక్కడి దర్శకులు, హీరోలు వడ్డించిందే మహాప్రసాదం అనుకుని సర్దుకుపోవాల్సిన పరిస్థితి తమిళ ప్రేక్షకులకు తలెత్తింది.
విజయ్ చేసిన మెర్శల్, బిగిల్, మాస్టర్.. అజిత్ నుంచి వచ్చిన విశ్వాసం, వలిమై, రజినీకాంత్ తీసిన దర్బార్, అన్నాత్తె.. ఇలా ఏ సినిమా తీసుకున్నా కొత్తగా అనిపించేవి కావు. ఇవన్నీ చాలా వరకు రొటీన్ మాస్ మసాలా సినిమాలే. కానీ వీటికే తమిళ ప్రేక్షకులు పట్టం కట్టారు. కానీ ఒకప్పుడు వైభవం చూసిన తమిళ సినిమా ఈ స్థాయికి పడిపోవడం అక్కడ అభిరుచి ఉన్న ప్రేక్షకులకు ఆవేదన కలిగిస్తూనే ఉంది. ఇలాంటి టైంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందించిన ‘విక్రమ్’ సినిమా తమిళ ఆడియన్స్‌కు వరప్రసాదంలా మారింది. తమిళంలో ఈ మాత్రం కొత్తదనం ఉన్న, ఉత్కంఠభరితంగా సాగిన సినిమా వచ్చి చాలా కాలం అయింది.
‘ఖైదీ’తో అందరినీ మెప్పించిన లోకేష్.. మళ్లీ కంటెంట్ పరంగా దానికి దగ్గరగా నిలిచేలా ‘విక్రమ్’ను తీర్చిదిద్దాడు. కథలో వైవిధ్యం, కథనంలో వేగం, అలాగే ప్రధాన పాత్రధారుల నటన, టెక్నీషియన్స్ సపోర్ట్ బాగా కుదిరి ఈ సినిమా తమిళంలో బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. లేక లేక కంటెంట్ ఉన్న ఓ పెద్ద సినిమా రావడంతో తమిళ ప్రేక్షకులు వెర్రెత్తిపోతున్నారు. వీకెండ్లో అక్కడీ సినిమా దుమ్ముదులిపేలాగే ఉంది. సినిమాకు లాంగ్ రన్ గ్యారెంటీ అనిపిస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో కూడా ‘విక్రమ్’ టాక్ బాగానే ఉంది. మరి దీన్నుంచి ఇన్‌స్పైర్ అయి మిగతా హీరోలు, దర్శకులు కూడా తమిళ సినిమాకు పునర్వైభవం తెచ్చేలా మంచి సినిమాలు చేస్తారేమో చూడాలి.
This post was last modified on June 4, 2022 3:06 pm
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంలో హైదరాబాద్ యువ క్రికెటర్…