కేవలం 20 రోజులకే సర్కారు వారి పాట ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేయడంతో మరోసారి థియేటర్ల మనుగడకు సంబంధించిన చర్చ మొదలయ్యింది. నిన్న పక్కా కమర్షియల్ ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. జనాలు సినిమా హాళ్లకు రావడం చాలా తగ్గించారని, అల్లు అర్జున్ ఎఫ్3ని క్యూబ్ లో చూస్తానని అడిగితే వద్దు సింగల్ స్క్రీన్లోనే ఎంజాయ్ చేయమని కూకట్ పల్లికి పంపించానని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. సరే వాళ్లంటే సెలబ్రిటీలు ఎలా చూసినా చెల్లుతుంది కానీ సామాన్య ప్రేక్షకుడి పరిస్థితి అలా ఉండదుగా. దేనికైనా ఓ పద్ధతి ప్రకారం లెక్కలు వేసుకోవాలి.
ఇకపై రాబోయే సినిమాలు కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల గ్యాప్ తో ఓటిటిలో రావాలనే నిబంధనను నిర్మాతల మండలి తీసుకురాబోతోందట. అంటే రెండు నెలల తర్వాతే స్ట్రీమింగ్ అన్నమాట. ఆమేరకు ప్రొడ్యూసర్లతో అగ్రిమెంట్ కూడా చేస్తారు. ఇలాంటివి గతంలో చాలా చెప్పారు చేశారు. కానీ ప్రాక్టికల్ గా ఏదీ సాధ్యపడలేదు. కేవలం 14 రోజులకే ప్రైమ్ లో ప్రత్యక్షమైన చిన్న సినిమాలున్నాయి. ఆదాయం కోసమో లేక ఫ్లాప్ అయ్యింది కాబట్టి ఎంతో కొంత వస్తుందనే ఉద్దేశంతోనో ఓటిటిలు ఈ విషయంలో మంచే చేశాయి. కానీ బడా స్టార్ల ప్యాన్ ఇండియా సినిమాలే మూడో వారం దాటగానే జై ఓటిటి అంటుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు.
క్షేత్ర స్థాయిలో చాలా మార్పులు జరగాలి. పుష్ప పార్ట్ 1 ది రైజ్, ఆచార్య, రాదే శ్యాం, సర్కారు వారి పాట ఇవన్నీ 21 రోజులకు ప్రైమ్ లో వచ్చిన సినిమాలు. ఆర్ఆర్ఆర్ 50 రోజులకు, కెజిఎఫ్ 2 హాఫ్ సెంచరీ అయ్యాక ప్రీమియర్ చేసుకున్నాయి. చిన్న చిత్రాలను నిందించడానికి లేదు. నాలుగో రోజే డెఫిషిట్లతో నెగటివ్ షేర్ లో పడిపోతున్న వీటికి కండిషన్లు పెట్టడం కరెక్ట్ కాదు. అలా చేస్తే ఓటిటి సంస్థలు ఇచ్చే మొత్తంలో భారీ కోత విధిస్తాయి. ఈ ఓటిటి పంచాయితీ తర్వాత చూసుకోవచ్చు. ముందు ప్రతి కొత్త సినిమాకు టికెట్ రేట్లను మార్చి మార్చి ప్రేక్షకులను అయోమయానికి గురి చేసే పద్ధతికి స్వస్తి చెబితే జనాన్ని థియేటర్ కు ఎలా రప్పించాలో అప్పుడు ఆలోచించుకోవచ్చు. అంతే తప్ప కేవలం ఓటిటిలో రావడమే దెబ్బకొడుతోందన్న కోణంలో ఆలోచిస్తే పరిష్కారం దొరకదు.
This post was last modified on June 5, 2022 7:36 pm
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…