చివరగా గత ఏడాది చివర్లో శ్యామ్ సింగరాయ్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు నేచురల్ స్టార్ నాని. ఓటీటీల్లో వచ్చిన వి, టక్ జగదీష్ చిత్రాలు తీవ్ర నిరాశకు గురి చేశాక ఈ సినిమా నానీకి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. శ్యామ్ సింగరాయ్ హిట్ ఊపులో ఇప్పుడు బ్లాక్‌బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు నాని. అతడి కొత్త చిత్రం అంటే సుందరానికీ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా పేరు దగ్గర్నుంచి ప్రతిదీ ఆసక్తికరంగా అనిపిస్తోంది. ప్రోమోలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ట్రైలర్ కూడా ఆద్యంతం వినోదాత్మకంగా, ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. ఒక పద్ధతైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయికి.. ఒక క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయికి మధ్య నడిచే ప్రేమకథను వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేసినట్లున్నాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. సినిమాలో ఇది కాక ఇంకేదో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. దాన్ని ట్రైలర్లో సస్పెన్స్‌లాగా దాచి పెట్టారు. అదేంటో థియేటర్లలోనే చూడాలి.
కాగా అంటే సుందరానికీ మీద నాని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని అతడి మాటల్ని బట్టి అర్థమవుతోంది. ట్రైలర్ లాంచ్ సందర్భంగా అతను పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు. మామూలుగా మంచి సినిమా తీశాం బ్లాక్‌బస్టర్ చేయండని ప్రేక్షకులను అడుగుతుంటామని, కానీ ఈసారి కథ వేరని, తాము బ్లాక్‌బస్టర్ సినిమా తీశామని, ఇక దాన్ని ఎక్కడిదాకా తీసుకెళ్తారన్నది ప్రేక్షకుల ఇష్టమని వ్యాఖ్యానించాడు నాని. తమ సినిమాలు రిలీజవున్నపుడు ప్రతి హీరో ఇలా గొప్పలు పోవడం మామూలే కానీ.. నాని మాటలు అతిశయోక్తిలాగా ఏమీ అనిపించలేదు. అంటే సుందరానికీ ప్రోమోలతో సినిమా ఇప్పటికే పెరిగిన అంచనాలను అతడి మాటలు ఇంకా పెంచేలాగే ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని సరసన మలయాళ భామ నజ్రియా నజ్రీన్ నటించింది. వివేక్ సాగర్ సంగీత దర్శకుడు.
This post was last modified on June 4, 2022 7:59 am
కొందరు దర్శకులకు తాము తీసింది ఫ్లాపని ఒప్పుకోవాలంటే మహా కష్టంగా అనిపిస్తుంది. ఏదో ఒక సాకు చెప్పి తాము తీసింది…
ఐపీఎల్ 2025 సీజన్లో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం…
బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ విషయంలో ఏదైనా కొంత అసంతృప్తి కలిగించిన…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లో దినదినాభివృద్ది సాధిస్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని…
గత ఏడాది డిసెంబర్లో ఆల్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టిన పుష్ప 2 తెలుగులో కంటే హిందీలోనే భారీ వసూళ్లు…
బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదగడం అంత తేలికైన విషయం కాదు. ఎంతో ప్రతిభ ఉండాలి.…