సోషల్ మీడియాలో సెలబ్రెటీల మీద విషం కక్కే ఊరూ పేరూ లేని ట్విట్టర్ ఐడీలు చాలానే ఉంటాయి. ఐడెంటిటీ ఉండదు కాబట్టి ఎవరిని ఎంత మాటైనా అనేయొచ్చని ఫీలవుతుంటారు నెటిజన్లు. సెలబ్రెటీలకు ఇలాంటి వాళ్లను పట్టించుకునే తీరిక, ఓపిక ఉండదు కాబట్టి వాళ్ల బండి నడిచిపోతుంటుంది. కానీ కొందరు సెలబ్రెటీలు ఇలాంటి వాళ్లను ఊరికే వదలరు. కొందరు తీవ్ర పదజాలంతోనే సమాధానం ఇస్తుంటారు.
ఇంకొందరు సున్నితంగానే దీటైన జవాబిస్తుంటారు. కామెంట్ చేసిన వాళ్లు సిగ్తుతో తలదించుకునేలా చేస్తుంటారు. టాలీవుడ్ యువ నటుడు దగ్గుబాటి రానా కూడా అదే పని చేశాడు. తనను తక్కువ చేసి మాట్లాడిన ఓ నెటిజన్‌కు సున్నితమైన మాటలతోనే చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పాడు.
రానా కొత్త సినిమా విరాటపర్వం నుంచి తాజాగా ఒక పోస్టర్ లాంచ్ చేశారు. అందులో రానా ముఖం కనిపించడం లేదు. అతడిని హత్తుకుని ఉన్న సాయిపల్లవినే హైలైట్ అయింది. ఆమె మీదే ఫోకస్ పెట్టారు పోస్టర్లో. ఇది చూపి ఒక నెటిజన్.. ఛీ దరిద్రం సొంత బేనర్లోనే ఫేస్ కట్ చేశారు. ఇక బయటి వాళ్లు వేలెత్తి చూపించడంలో తప్పేముందిలే. వాళ్ల వీళ్ల సినిమాల్లో తక్కువ క్యారెక్టర్స్ చేయడం అందరికీ లోకువ అయిపోవడం దగ్గుబాటి రానా స్టైల్ అని కామెంట్ చేశాడు.
రానా ఈ కామెంట్‌ను పట్టించుకోకుండా వదిలేయలేదు. అలాగని ఆ నెటిజన్ లాగా నోరు జారలేదు. మనం తగ్గి కథను హీరోయిన్న ఎలివేట్ చేయడంలో ఉండే కిక్కే వేరు బ్రదర్. సొంత బేనర్ కదా. గొప్ప పనులు ఇక్కడే చేయొచ్చు అని బదులిచ్చాడు. రానా ఇచ్చిన సమాధానంపై ప్రశంసల జల్లు కురిసింది. సదరు నెటిజన్ సిగ్గుపడేలా భలే జవాబిచ్చావంటూ అతడిని అందరూ కొనియాడుతున్నారు.
This post was last modified on June 4, 2022 7:51 am
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…