Movie News

విరాటపర్వం ముందున్న సవాళ్లు

నిర్మాణంలోనే విపరీతమైన ఆలస్యం జరిగి వాయిదాల మీద వాయిదాలుతో ఫైనల్ గా ఈ నెల 17న వస్తున్న విరాట  పర్వం మీద ఉండాల్సినంత హైప్ ఇంకా రాలేదన్న లేదన్న మాట వాస్తవం. ప్రమోషన్లు మొదలుపెట్టినప్పటికీ సోషల్ మీడియాలో కనిపించాల్సిన హడావిడి మొదలుకాలేదు. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బ్యానర్ ఉన్నా కదలిక తక్కువగా ఉంది.

పోస్టర్లు లిరికల్ వీడియోలు అంటూ చిన్నగా స్టార్ట్ చేసినప్పటికీ చేతిలో ఇంకో రెండు వారాలు మాత్రమే ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. అసలే ఇది నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పీరియాడిక్ మూవీ. జనాలకు ఈ మధ్య ఈ కాన్సెప్ట్ అట్టే ఎక్కడం లేదు. ఆచార్యలో చిరంజీవి చరణ్ లు కలిసి చేసిన ఈ ఎపిసోడే పెద్ద మైనస్ అయ్యింది.

కమర్షియల్ ఫ్లేవర్ అద్దితేనే అలా ఉంది. కార్తికేయ రాజా విక్రమార్కలోనూ ఇదే తేడా కొట్టింది. కానీ విరాట పర్వం అలా కాదు. థీమ్ కు కట్టుబడి నిజాయితీగా సాగే మెసేజ్ ఓరియెంటెడ్ సోషల్ మూవీ. ఇంత సీరియస్ ఇంటెన్స్ డ్రామాని సామాన్య ప్రేక్షకులు, మాస్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఎన్నో ప్రశ్నలను రేపుతోంది.

దర్శకుడు వేణు ఊడుగుల చేసింది ఒకే సినిమా. నీది నాది ఒకే కథ విమర్శకుల ప్రశంసలతో పాటు హిట్ స్టేటస్ అందుకుంది కానీ కమర్షియల్ గా ఎలాంటి అద్భుతాలు చేయలేకపోయింది. కనీసం అందులో యూత్ ని ఆకట్టుకునే పాయింట్ ఉంది. కానీ విరాట పర్వం చాలా సవాళ్ళను ఎదురుకోవాల్సి ఉంటుంది. డ్రైగా అనిపించే నక్సలిజం కాన్సెప్ట్ అందరూ కలిసి చూడొచ్చనేలా ప్రమోషన్ల వేగం పెంచాలి. ముఖ్యంగా రానా సాయిపల్లవిల కాంబినేషన్ ని ఎంత స్ట్రాంగ్ గా తీసుకెళ్లగలిగితే ఓపెనింగ్స్ కి అంత ప్లస్ అవుతుంది. 

This post was last modified on June 3, 2022 9:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

1 hour ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago