Movie News

ఆర్ఆర్ఆర్.. రీరిలీజ్ మేనియా

సూపర్ హిట్ సినిమాలకు ఒకసారి థియేట్రికల్ రిలీజ్ ముగిశాక.. కొంచెం గ్యాప్ ఇచ్చి రీరిలీజ్ చేసే సంప్రదాయం గతంలో ఉండేది. ఇలా రెండోసారి రిలీజై కూడా 50, 100 రోజుల పాటు సినిమాలు ఆడేవి అప్పట్లో. ఐతే ఫస్ట్ రిలీజ్‌లోనే రెండు మూడు వారాలకు మించి సినిమాలు నిలబడే పరిస్థితి లేని ట్రెండ్ వచ్చాక రీరిలీజ్ అనే మాట చరిత్రలో కలిసిపోయింది.

అందులోనూ థియేట్రికల్ రిలీజ్ తర్వాత మూణ్నాలుగు వారాలకే కొత్త చిత్రాలు ఓటీటీల్లోకి వచ్చేస్తుండటంతో మళ్లీ సినిమాను థియేటర్లలోకి తేవడం గురించి ఎవరు ఆలోచిస్తారు? కాబట్టి ఆ ట్రెండ్ పూర్తిగా అంతరించినట్లే చెప్పాలి. కానీ రాజమౌళి కొత్త చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ మళ్లీ పాత సంప్రదాయాన్ని తిరిగి తీసుకొచ్చింది. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం నెల రోజులకు పైగా థియేటర్లలో సందడి చేయడం తెలిసిందే. ఐతే వరల్డ్ వైడ్ థియేట్రికల్ రన్‌కు గత నెలలోనే దాదాపు తెరపడగా.. మే 20 నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీల్లో స్ట్రీమ్ చేస్తున్న విషయం విదితమే.

ఓటీటీ స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి కొత్తగా థియేటర్లలో ఓ సినిమా రిలీజైన తరహాలో ‘ఆర్ఆర్ఆర్’ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమా హిందీ వెర్షన్‌ను చూస్తున్న అంతర్జాతీయ ప్రేక్షకులు దాన్ని ఒక రేంజిలో పొగుడుతున్నారు. చాలామంది బిగ్ స్క్రీన్లలో ఈ సినిమా చూడనందుకు ఫీలవుతున్నారు. ఐతే వాళ్లకు మళ్లీ ఓ అవకాశం కల్పిస్తూ యుఎస్‌లో ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేశారు. సెలక్టివ్ స్క్రీన్లలో ఇంటర్నేషనల్ కట్‌తో ఈ సినిమాను రిలీజ్ చేశారు. దీనికి రెస్పాన్స్ మామూలుగా లేదు. మార్చిలో యుఎస్‌లో సినిమాను రిలీజ్ చేసినపుడు చాలావరకు ఇండియన్ ఫ్యాన్సే చూశారు. కానీ ఇప్పుడు రీరిలీజ్‌లో నేటివ్ అమెరికన్సే ఎక్కువగా సినిమా చూస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ థియేటర్లు అమెరికన్ ఆడియన్స్‌తో నిండిపోయి కళకళలాడుతుండటం.. వాళ్లు సినిమాలో సన్నివేశాలకు వెర్రెత్తిపోతుండటం.. సంబంధిత దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. ఓ ఇండియన్ సినిమా కోసం అమెరికన్స్ ఇలా ఎగబడడం, ఇలాంటి రెస్సాన్స్ ఇవ్వడం అరుదైన విషయం.

This post was last modified on June 2, 2022 4:40 pm

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

3 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

5 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

10 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

11 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

11 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

11 hours ago