ఫ్లాప్ అందుకున్న హీరోతో సినిమా చేస్తే ఆ దర్శకుడిపై చాలా భారం ఉంటుంది. ఆ హీరోకి మళ్ళీ ఎలాగైనా హిట్ ఇచ్చే భాద్యత ఆ దర్శకుడిపై పడుతుంది. తాజాగా అలాంటి భారం , భాద్యత రెండూ ఇప్పుడు వంశీ పైడిపల్లి పై పడ్డాయి. అవును విజయ్ తో వంశీ తెలుగు , తమిళ్ బైలింగ్వెల్ సినిమా చేస్తున్నాడు. విజయ్ ప్రీవియస్ మూవీ ‘బీస్ట్’ ఫ్యాన్స్ ని సైతం నిరాశ పరిచింది. కోలీవుడ్ లో ఈ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. విజయ్ కి ఉన్న క్రేజ్ తో మోస్తరు కలెక్షన్లు వచ్చాయి.
అందుకే ఇప్పుడు విజయ్ తో వంశీ చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు కోలీవుడ్ ఆడియన్స్. విజయ్ ఫ్యాన్స్ టాలీవుడ్ డైరెక్టర్ తమ హీరోకి రెండు భాషల్లోనూ అదిరిపోయే హిట్ ఇస్తాడని ఆశలు పెట్టుకుంటున్నారు. నిజానికి వంశీ తమిళ్ ఆడియన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా మెస్మరైజ్ చేయాలి. ఇది విజయ్ కి తెలుగులో మొదటి సినిమా. ఈ సినిమాతో స్ట్రైట్ హీరోగా ఇక్కడ మరింత మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు విజయ్. అందుకే వంశీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరి వంశీ విజయ్ కి ఏ రేంజ్ హిట్ ఇస్తాడో , తమిళ్ , తెలుగు ఆడియన్స్ ని ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.
శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , శరత్ కుమార్ వంటి వెర్సటైల్ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజర్. విజయ్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇటివలే మొదటి షెడ్యుల్ కంప్లీట్ చేశారు. మరికొద్ది రోజుల్లో రెండో షెడ్యుల్ మొదలు పెట్టనున్నారు.
This post was last modified on June 2, 2022 4:32 pm
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…