ఇంకా షూటింగ్ మొదలవ్వలేదు కానీ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడుమీదున్నాయి. స్క్రిప్ట్ లాక్ అయిపోగా కీలకమైన క్యాస్టింగ్ ని చాలా జాగ్రత్తగా సెట్ చేసుకుంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించడమనే పాయింట్ తప్ప యూనిట్ నుంచి ఇంకే అప్ డేట్ అఫీషియల్ గా రాలేదు. అందుకే ఎవరెవరు నటిస్తారనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఉంది. ముఖ్యంగా ఇతర బాషల నుంచి నోటెడ్ ఆర్టిస్టులను ప్రత్యేకంగా తీసుకొచ్చే త్రివిక్రమ్ ఈసారి కూడా అలాగే చేయబోతున్నారట.
కన్నడలో క్రేజీ స్టార్ గా పిలవబడే శాండల్ వుడ్ సీనియర్ హీరో వి రవిచంద్రన్ ను ఈ ప్రాజెక్టులో భాగం చేయబోతున్నట్టు సమాచారం. చాలా కీలకంగా కనిపించే ఈ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుందట. అందుకే ఆయన్ను సంప్రదించినట్టు తెలిసింది. రవిచంద్రన్ ఇప్పటి జెనరేషన్ కు అంతగా తెలిసుండకపోవచ్చు కానీ నిన్నటి యువతరానికి మాత్రం సుపరిచితులే. ఇప్పుడు కెజిఎఫ్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ 1990లోనే ముగ్గురు బడా హీరోలతో శాంతి క్రాంతి అనే ప్యాన్ ఇండియా మూవీని నిర్మించారు.
మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ రోల్ చేసిన ఒకే ఒక కన్నడ సినిమా సిపాయి రవిచంద్రన్ తీసిందే. ఒకప్పుడు ప్రేమలోకం లాంటి డబ్బింగ్ చిత్రాలు ఇక్కడ బాగానే ఆడాయి. ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ అక్కడి యూత్ హీరోలతో పోటీ పడే రవిచంద్రన్ నిజంగా మహేష్ బాబుతో జట్టు కడితే మంచి కాంబినేషన్ అవుతుంది. ఇలాంటి తాజా కలయికలను సెట్ చేయడంలో నిష్ణాతుడైన త్రివిక్రమ్ మరి ఫైనల్ గా ఆయన్ను స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీ ద్వారా మనకు పరిచయం చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.
This post was last modified on June 2, 2022 10:25 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…