అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ చేస్తున్న సినిమాలు అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. సూపర్ హిట్లు కొట్టిన యూత్ డైరెక్టర్లతో జట్టు కట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గోపీచంద్ మలినేని తర్వాత అనిల్ రావిపూడిని ఎంచుకోవడం ఎంత తెలివైన నిర్ణయమో ఎఫ్3తో అతను డబుల్ హ్యాట్రిక్ కొట్టాక అర్థమైపోయింది. అయితే బాలయ్య నెక్స్ట్ ఎవరితో చేస్తున్నారనే క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. ఫిలిం నగర్ టాక్ ప్రకారం రచయిత కం దర్శకుడు బివిఎస్ రవికి ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినికిడి.
బాలకృష్ణ అంతే. కథ నచ్చితే డైరెక్టర్ ట్రాక్ రికార్డుని అస్సలు పట్టించుకోరు. చేసుకుంటూ వెళ్లడమే. ఈ కారణంగానే వీరభద్ర, లయన్, విజయేంద్రవర్మ లాంటి డిజాస్టర్లు చవిచూడాల్సి వచ్చింది. అలా అని కొత్తవాళ్లను నమ్మినప్పుడు హిట్లు రాలేదని కాదు.
అలా అయితే సింహ చేసే టైంకి బోయపాటి వయసు రెండు సినిమాలే. ఆయనకు నెరేషన్ కన్విన్స్ చేసేలా చెప్పగలిగితే చాలు చిన్నపిల్లాడిలా మాట వింటారన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే బివిఎస్ రవికి ఈ ఆఫర్ వచ్చేందుకు వేరే కారణం ఉంది.
బాలయ్య మొట్టమొదటి స్మాల్ స్క్రీన్ ఎంట్రీ కం టాక్ షో అన్ స్టాపబుల్ ను రూపొందించింది ఈ బివిఎస్ రవినే. దాని సక్సెస్ లో ఆయన పాత్ర చాలా ఉంది. అది దగ్గరి నుంచి గమనించిన బాలకృష్ణ బాగా ప్రోత్సహించారు.
రవి చెప్పిన ఒక లైన్ నచ్చడంతో ఆల్మోస్ట్ ఓకే చెప్పారట. గోపీచంద్ వాంటెడ్, సాయి తేజ్ జవాన్ లతో దర్శకుడిగా విజయం సాధించలేకపోయిన బివిఎస్ కి ఇది నిజంగా కన్ఫర్మ్ అయితే బంగారంలాంటి అవకాశమే. సరైన స్క్రిప్ట్ తో మాస్ బాలయ్యని చూపించి హిట్టు కొడితే టాప్ లిస్టులోకి దూసుకుపోవచ్చు.
This post was last modified on May 31, 2022 6:23 pm
భారత్, పాకిస్థాన్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఒకవేళ ఈ పరిస్థితి యుద్ధంగా మారితే, ఐక్యరాజ్య సమితి…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ ఈ నెల మూడో వారంలో ప్రారంభం కానుంది.…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో హీరో ఇమేజ్, మార్కెట్, క్యాస్టింగ్ పరంగా ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నది సింగిల్ కే.…
కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ…
ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై…
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని…