జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రూపొందబోయే భారీ ప్యాన్ ఇండియా మూవీ తాలూకు పనులు జెట్ స్పీడ్ తో కాదు కానీ ఒక్కొక్కటిగా మెల్లగా జరుగుతున్నాయి. కాన్సెప్ట్ రివీల్ చేస్తూ చిన్న వీడియో అయితే వదిలడం తప్ప ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు. ఇందులో సీనియర్ హీరోయిన్ సోనాలి బెంద్రే ఓ కీలక పాత్ర చేయనుందని కొద్దిరోజుల క్రితం ప్రచారం జరిగింది.
కథను మలుపు తిప్పే ముఖ్యమైన క్యారెక్టర్ ని డిజైన్ చేశారని అందుకావిడ ఒప్పుకుందని కూడా రకరకాల కథనాలు వచ్చాయి. వీటికి సోనాలి బెంద్రే స్వయంగా స్పందించారు. అలాంటి ప్రతిపాదన కానీ ఆఫర్ కానీ ఏదీ రాలేదని తేల్చి చెప్పేశారు. నాకు తెలియకుండా ఇదంతా జరగడం చూస్తే సస్పెన్స్ సినిమాలా ఉందని కూడా చమత్కరించారు.
సో ఫైనల్ గా ఇందులో సోనాలి లేదనే స్పష్టత వచ్చేసింది. ఒకప్పుడు తెలుగులో మురారి, శంకర్ దాదా ఎంబిబిఎస్, ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్స్ ఆమెకున్నాయి. ఒక్క పలనాటి బ్రహ్మనాయుడు మాత్రమే ఫ్లాప్ గా నిలిచింది. 2003లో చిరంజీవితో జోడికట్టిన తర్వాత సోనాలి మళ్ళీ టాలీవుడ్లో కనిపించలేదు
ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ అనగానే ఫ్యాన్స్ సంబరపడ్డారు. క్యాన్సర్ తో పోరాడి చావును జయించి తిరిగి సామాన్య జనజీవనంలోకి వచ్చిన సోనాలి బెంద్రే నటించడం గురించి సీరియస్ గా ఆలోచిస్తున్న మాట వాస్తవమే కానీ ఇంకా ఏ ప్రాజెక్టుకు సైన్ చేయలేదు. రెండు మూడు బాలీవుడ్ ప్రపోజల్స్ ని పెండింగ్ లో ఉంచింది. సరే ఇప్పుడు ఆమె లేదని తేలిపోయింది కానీ కొరటాల శివ ఎవరిని ఎంచుకుంటాడో చూడాలి. నదియా, టబు, ఖుష్బూ, రమ్యకృష్ణ, కస్తూరి లాంటి కొన్ని ఆప్షన్లు చూస్తున్నారట కానీ ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు.
This post was last modified on May 31, 2022 11:26 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…