త్వరలో ప్రారంభం కానున్న మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎప్పుడో స్క్రిప్ట్ సిద్ధమై ఓకే చేసుకున్న ప్రాజెక్ట్ అయినప్పటికీ తారాగణం సెట్ చేయడం సవాల్ గా మారిందట. ముఖ్యంగా విలన్ ని ఎంపిక చేసుకునే చెసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే మాటల మాంత్రికుడు ఇందులో కూడా క్రేజీ యాక్టర్ ని తీసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ఇన్ సైడ్ రిపోర్ట్. ప్యాన్ ఇండియా కాకపోయినా సౌత్ మార్కెట్ కోసమైనా ఇలాంటి జాగ్రత్తలు అవసరం.
రెండు రోజుల క్రితం నందమూరి తారకరత్న పేరు సోషల్ మీడియాలో హడావిడి చేసింది. ఆయన దాన్ని ఖండించారు కూడా. అయినా నిజంగా తనున్నా కూడా ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. ఆ మాటకొస్తే ఇది నిజం కాకపోతే బాగుండని మహేష్ ఫ్యాన్స్ అనుకున్నారు. తాజాగా విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, పృథ్విరాజ్ సుకుమారన్లలో ఒకరిని ట్రై చేస్తున్నట్టు వీళ్ళలో మొదటి ఇద్దరు ఆల్రెడీ ఉప్పెన, పుష్పలతో తెలుగులోనూ మంచి గుర్తింపు ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఎటొచ్చి పృథ్విరాజే పెండింగ్.
సాధారణంగా నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ని అంత ఈజీగా ఒప్పుకోని ఈ టాలెంటెడ్ యాక్టర్ మహేష్ కు ఓకే చెబుతాడా అనేది వేచి చూడాలి. భీమ్లా నాయక్ లో రానా వేసిన పాత్రను ఒరిజినల్ చేసింది ఇతనే. చిరంజీవి గాడ్ ఫాదర్ మాతృక లూసిఫర్ దర్శకుడు కూడా ఈ పృథ్వి రాజే. ఒకవేళ ఒప్పుకుంటే స్క్రీన్ మీద చాలా ఫ్రెష్ ఫీల్ అవుతుంది. సర్కారు వారి పాట హిట్ అనిపించుకున్న దాని ఫైనల్ స్టేటస్ పట్ల అంత సంతృప్తిగా లేని అభిమానులకు ఈ సినిమా మీద అంచనాలు అన్ని ఇన్ని కావు. అందుకే ఇంత ప్లానింగ్.
This post was last modified on May 30, 2022 9:25 am
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…