భారీ అంచనాలు.. అదే సమయంలో అనేక సందేహాల మధ్య ఈ వీకెండ్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘ఎఫ్-3’ సినిమా. ‘ఎఫ్-2’కు కొనసాగింపుగా తీసిన సినిమా కావడం వల్ల దీనిపై భారీ అంచనాలు నెలకొనగా.. ఇప్పుడు టికెట్ల ధరలు పెరిగిపోవడానికి తోడు వేరే కారణాల వల్ల ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూసే విషయంలో చాలా సెలెక్టివ్‌గా తయారవడం, పైగా ‘ఎఫ్-3’ మీద మోయలేనంత బిజినెస్ భారం ఉండటం ఈ సినిమా సక్సెస్ మీద సందేహాలు నెలకొన్నాయి.
ఐతే సినిమాకు తొలి రోజు అంతా సానుకూలంగా జరిగింది. చాలా వరకు రివ్యూలు.. అలాగే మౌత్ టాక్ పాజిటివ్‌గా వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ముందు ఆశించిన స్థాయిలో లేకపోయినా రిలీజ్ దగ్గర పడేసరికి పరిస్థితి మెరుగుపడింది. తొలి రోజు మంచి ఆక్యుపెన్సీతోనే నడిచింది ‘ఎఫ్-3’. డే-1 షేర్ కూడా రూ.9 కోట్లకు పైగా రావడం శుభసూచకం. ఇక రెండో రోజు వసూళ్లలో పెద్దగా డ్రాప్ కూడాా కనిపించలేదు.
తొలి రోజుకు దీటుగా రూ.రూ.8.5 కోట్ల మేర షేర్ వచ్చింది. రెండో రోజు మామూలుగా కొత్త సినిమాలకు కనిపించేంత డ్రాప్ ఈ సినిమాకు లేదు. ఓవరాల్‌గా రెండు రోజుల షేర్ రూ.18 కోట్లకు చేరువగా ఉంది. ఆదివారం కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగాయి. సినిమా ఈ రోజంతా హౌస్ ఫుల్స్‌తో నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. తొలి రెండు రోజులతో సమానంగా మూడో రోజు షేర్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
మొత్తంగా వీకెండ్ షేర్ రూ.25 కోట్లు దాటే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా రేంజికి ఇవి మంచి వసూళ్లే. కానీ ‘ఎఫ్-3’ వీకెండ్ వరకు జోరు చూపిస్తే సరిపోదు. దీనికి లాంగ్ రన్ అవసరం. రెండు వారాలైనా నిలకడగా వసూళ్లు రాబడితే తప్ప బయ్యర్లు బయటపడే పరిస్థితి లేదు. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు దాదాపు రూ.80 కోట్లు పలకడం గమనార్హం.
అంటే వీకెండ్ రికవరీ మూడింట ఒక వంతే ఉండబోతోంది. దీని మీద ఇంకో రెండు రెట్లు షేర్ రాబడితే తప్ప బయ్యర్లు సేఫ్ జోన్లోకి రాలేరు. అందుకోసం సినిమా రన్ మూడో వీకెండ్ వరకు కొనసాగాలి. కానీ వీకెండ్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఏ మేర థియేటర్లకు వస్తారు.. వీక్ డేస్‌లోసినిమా ఎంత మాత్రం నిలబడుతుంది అన్నది ప్రశ్న. వచ్చే వారం మేజర్, విక్రమ్ మంచి అంచనాల మధ్య రిలీజవుతున్న నేపథ్యంలో వాటి పోటీని తట్టుకుని ‘ఎఫ్-3’ బయ్యర్లను ఎలా బయట పడేస్తుందో మరి.
This post was last modified on May 29, 2022 2:30 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…