ఆర్టిస్ట్ గా కంగనా రౌనత్ నటనకు ఎవరూ వంకలు పెట్టరు కానీ లేనిపోని వివాదాల్లో తలదూర్చి తనను తాను ఫైర్ బ్రాండ్ గా చూపించుకునే ప్రయత్నం అప్పుడప్పుడు బూమరాంగ్ లా వెనక్కు కొడుతుంది. ఎవరేమనుకున్నా తన దారి తనదే అనేలా సాగే ఈ మణికర్ణిక బ్యూటీ కొత్త సినిమా డాఖడ్ గత వారం విడుదలైన సంగతి తెలిసిందే.
సుమారు 90 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మీద కంగనా ముందు నుంచి చాలా నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వచ్చింది. ఓటిటి ఆఫర్లు వచ్చినా నో చెప్పి పంపించేసింది. కట్ చేస్తే మార్నింగ్ షో నుంచే డిజాస్టర్ టాక్ మూటగట్టుకున్న ఈ డాఖడ్ రోజురోజుకి మరీ దారుణంగా పెర్ఫార్మ్ చేస్తోంది. నిన్న దేశవ్యాప్తంగా కేవలం 4 వేల 440 రూపాయల కలెక్షన్ వచ్చిందంటేనే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బాలీవుడ్ బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో ఒకటిగా నిలిచేందుకు డాఖడ్ పరుగులు పెడుతోంది. దాదాపు అన్ని చోట్ల థియేటర్ బయట, ఆన్ లైన్ లో పోస్టర్లు పెడుతున్నారు కానీ షోలు క్యాన్సిలైన దాఖలాలే అన్నీ. దెబ్బకు డిస్ట్రిబ్యూటర్లు లబోదిబోమంటూ నెత్తినోరు బాదుకుంటున్నారు.
సరే జరిగిందేదో జరిగింది ఇప్పుడు కొనమని డాఖడ్ టీమ్ ఓటిటిలకు కబురు పంపిస్తే ఒక్కళ్ళంటే ఒక్కరు స్పందించలేదట. ఎంత తక్కువైనా సరే తీసుకునే ఆసక్తి లేదని తేల్చి చెప్పేసారు.యుట్యూబ్ లో అప్లోడ్ చేస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయని యాంటీ ఫ్యాన్స్ కంగనాను ట్రోల్ చేస్తున్నారు. అసలే ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2, పుష్పల దెబ్బకు సినిమా ఏ మాత్రం యావరేజ్ గా ఉన్నా నార్త్ ఆడియన్స్ ఒప్పుకోవడం లేదు. అలాంటిది మినిమమ్ కంటెంట్ లేకుండా నాసిరకం సినిమాతో వస్తే ఈ రేంజ్ తిరస్కారం జరగడం సహజమే.
This post was last modified on May 28, 2022 11:06 pm
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…