KGF యునానిమస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో నెక్స్ట్ ఏ సినిమా చేయాలో తెలియని ఒత్తిడిలో పడిపోయిన రాఖీ భాయ్ అలియాస్ హీరో యష్ ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకున్నాడని బెంగళూరు టాక్. నర్తన్ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీనికి సంబంధించిన చర్చలు గత కొన్ని నెలలుగా జరుగుతూనే ఉన్నాయి.
కానీ ఒక కొలిక్కి రావడానికి చాలా సమయం పట్టింది. పలు వెర్షన్ల మీద వర్క్ చేసి ఫైనల్ గా ఒకటి సంతృప్తికరంగా రావడంతో యూనిట్ అంగీకారానికి వచ్చిందని వినికిడి. ఈ నర్తన్ ఎవరనే ఆసక్తి రేగడం సహజం. 2017లో కన్నడలో శివరాజ్ కుమార్ – శ్రీమురళి కాంబినేషన్ లో మఫ్టీ వచ్చింది. ఇది పెద్ద హిట్టు. తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరిగాయి కానీ ఫలించలేదు.
తమిళంలో శింబు – గౌతమ్ కార్తీక్ హీరోలుగా పత్తు తల టైటిల్ తో షూటింగ్ మొదలుపెట్టాక ఏవో కారణాల వల్ల ఆపేశారు. మళ్ళీ కొనసాగిస్తారో లేదో డౌటే. నర్తన్ కు ప్రశాంత్ నీల్ దగ్గర పని చేసిన అనుభవం అది. కన్నడ డైరెక్టర్లతోనే చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న యష్ ఆల్మోస్ట్ డిసైడ్ అయ్యాడని అంటున్నారు
ఇకపై చేయబోయే సినిమాలన్నీ ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ అవుతాయి కాబట్టి కథల ఎంపికలో యష్ చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఇమేజ్ ని కాపాడుకునే క్రమంలో తొందరపడలేదు కానీ మరీ ఆలస్యం చేసినా ఇబ్బందే. మన దిల్ రాజుకు హోంబాలే ఫిలింస్ తో కలిసి ఒక ప్రాజెక్టు ఓకే చేశాడని టాక్ వచ్చింది కానీ దాన్ని డీల్ చేసేది నర్తనా లేక మరొకరా అనేది తెలియాల్సి ఉంది. కెజిఎఫ్ 2 హవా తగ్గిపోయి ఓటిటిలో కూడా వచ్చేసింది కాబట్టి ఇక రాబోయే సినిమాల వేగం పెంచడం చాలా అవసరం.
This post was last modified on May 28, 2022 7:55 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…