బాలీవుడ్లో గోల్ మాల్, ఢమాల్, హౌస్ ఫుల్ లాంటి కామెడీ సినిమాల ఫ్రాంఛైజీలు చాలానే ఉన్నాయి. కానీ తెలుగులో ఈ ట్రెండ్ ముందు నుంచి లేదు. ఐతే ఎఫ్-2 సినిమా సూపర్ హిట్టవడంతో ఇక్కడా ఇలాంటి ఫ్రాంఛైజీ మొదలైంది. దానికి కొనసాగింపుగా ఎఫ్-3 చేశారు. ఈ సినిమా విజయం మీద చాలా నమ్మకంగా ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు..
దీనికి కొనసాగింపుగా ఎఫ్-4 చేయబోతున్నట్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఐతే రాజు మాత్రం.. ఎఫ్-3 ఫలితాన్ని బట్టే ఈ సినిమా ఉంటుందని చెప్పగా, అనిల్ మాత్రం ఆ సినిమా పక్కా అంటే పక్కా అనే అంటున్నాడు. ఎఫ్-3 సక్సెస్ మీద అతడికున్న నమ్మకం కూడా ఇందుకు కారణం కావచ్చేమో. అంతే కాక ఎఫ్-4లో ఇంకో స్టార్ హీరో కూడా యాడ్ కాబోతున్నట్లు ముందే ప్రకటించేశాడు అనిల్.
నిజానికి ఎఫ్-3లోనే ఇంకో స్టార్ హీరో ఉంటాడని, ఆ పాత్రను మాస్ రాజా రవితేజ చేసే ఛాన్స్ అప్పట్లో వార్తలొచ్చాయి. ఐతే ఇది కేవలం ప్రచారం కాదని, నిజంగానే ఎఫ్-3లో ఇంకో స్టార్ హీరోను యాడ్ చేయాలని అనుకున్నామని, కానీ ఆ పాత్ర జోడించకుండానే కావాల్సినంత ఫన్ వచ్చేయడంతో, మరో క్యారెక్టర్ అవసరం లేదని వదిలేశామని అనిల్ తెలిపాడు.
కానీ ఎఫ్-4లో మాత్రం కచ్చితంగా ఇంకో స్టార్ హీరో యాడ్ అవుతాడని అనిల్ స్పష్టం చేశాడు. మరి ఈ పాత్రను రవితేజే చేస్తాడా.. ఇంకెవరినైనా ఆ పాత్రకు అనుకున్నారా అన్నది చూడాలి. మీడియం బడ్జెట్లో తెరకెక్కిన ఎఫ్-2 అప్పట్లో రూ.80 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేయడంతో.. ఎఫ్-3కి బడ్జెట్ రెట్టింపు చేశారు. ఈ చిత్రానికి రూ.80 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరగడం విశేషం. ఆ మేర షేర్ వస్తేనే ఎఫ్-4 ముందుకు కదిలే అవకాశముంది.
This post was last modified on May 27, 2022 8:11 am
పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…
‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్ను పిలిచి సింపుల్గా చేసేస్తారని అనుకున్నారంతా.…
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ…
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు,…
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడైనంత మాత్రాన చట్టాలు పాటించరా? అని…