విక్టరీ వెంకటేష్ తో కలిసి ‘ఎఫ్ ౩’ సినిమాతో సందడి చేయడానికి రెడీ అయ్యాడు వరుణ్ తేజ్. ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. తాజాగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. అయితే ఇంటర్వ్యూ ఆరంభంలోనే గని ఆఫ్టర్ రిలీజ్ నోట్ గురించి వరుణ్ కి ప్రశ్న ఎదురైంది.
దానికి సమాధానమిస్తూ “నేను నటించిన సినిమాల గురించి రిలీజ్ కి ముందు ఎక్కువ చెప్పను. కానీ ‘గని’ ని ఎక్కువ నమ్మేశా. అందువల్ల ఈ సినిమా బాగుంటుందని పదే పదే చెప్పడం జరిగింది. కానీ రిజల్ట్ చూశాక ఆడియన్స్ కి ఓ నోట్ ద్వారా నా వర్షన్ చెప్పాలనిపించింది. పైగా జెన్యూన్ గా రిజల్ట్ ని ఒప్పుకోవాలనిపించింది.” అన్నాడు.
ఇక ఎఫ్ 4 కి సంబంధించి అనీల్ తనకి నాలుగు పాయింట్స్ చెప్పాడని అందులో ఒకటి పిక్ చేసుకొని స్క్రిప్ట్ రెడీ చేశాక మళ్ళీ ఆ సినిమాతో వస్తామని అన్నాడు. ఇక వెంకటేష్ గారు తనతో ఓ సీనియర్ హీరోలా ఉండరని చాలా సరదాగా ఫ్రెండ్ లా ఉంటారని అందుకే అప్పుడప్పుడు రానాకి కాల్ చేసి మీ బాబాయ్ నీకు చెప్పని విషయాలు కూడా నాకు చెప్తున్నారని ఆట పట్టిస్తుంటా అని చెప్పాడు.
నెక్స్ట్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో చేయబోయే సినిమా జూన్ నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుందని, సినిమా ఎక్కువ భాగం లండన్ లోనే ఉంటుందని, అక్కడే మేజర్ పార్ట్ షూట్ చేయబోతున్నామని తెలిపాడు. ఇక హీరోగా అన్ని జోనర్ సినిమాలు చేయలని ఉంటుందని ఒకటే పట్టుకొని ఇష్టమని చెప్పలేనని అన్నాడు. ఎఫ్ ౩ లో నత్తితో మాట్లాడే పాత్రలో కనిపించనున్నాడు వరుణ్. వెంకటేష్ గారితో నైట్ టైం వచ్చే సీన్స్ హిలేరియస్ గా ఎంటర్టైన్ చేస్తాయని చెప్పుకున్నాడు. మరి చూడాలి వెంకీ తర్వాత వరుణ్ ఆ రేంజ్ లో కామెడీ పండిస్తాడా ?
This post was last modified on May 26, 2022 6:03 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…