టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘కృష్ణ అండ్ హిస్ లీల’ సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు రెడీ చేస్తున్నట్లు ప్రకటన వచ్చి నాలుగైదు రోజులే అయింది. ఆ తర్వాత ఒకట్రెండు చిన్న టీజర్లు వదిలారు. ఇలా ప్రమోషన్ మొదలుపెట్టి కొన్ని రోజుల పాటు ఏదో ఒక విశేషాన్ని పంచుకుంటూ.. ఆ తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి.. గట్టిగా ప్రమోట్ చేసి ఆ తర్వాత సినిమాను విడుదల చేస్తారని అనుకున్నారు.
రిలీజ్ డేట్ ఎప్పుడుంటుంది.. ఏ ఫ్లాట్ ఫాంలో రిలీజవుతుందనే సమాచారం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తుండగా.. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లకు పెద్ద షాకే ఇచ్చింది. బుధవారం అర్ధరాత్రి చడీచప్పుడు లేకుండా ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేసి పడేశారు. అసలు కొన్ని గంటల ముందు కూడా ‘కృష్ణ అండ్ హిస్ లీల’ రిలీజ్ గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా ఉన్నట్లుండి ఇలా సినిమాను రిలీజ్ చేసేయడం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు.
గురువారం ఉదయం ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్నట్లుగా ట్వీట్లు చూసి జనాలు షాకవుతున్నారు. నిన్న అర్ధరాత్రి సడెన్ అప్‌డేట్ చూసి వెంటనే కొందరు సినిమా చూసేశారు. రివ్యూలు కూడా కొన్ని బయటికి వచ్చాయి. ఇప్పటిదాకా రిలీజైన్ డైరెక్ట్ ఓటీటీ సినిమాలతో పోలిస్తే దీనికి మెరుగైన టాకే వినిపిస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ సరదాగా సాగిపోయిందని.. కాలక్షేపానికి బాగానే పనికొస్తుందని అంటున్నారు.
ఫైనల్ టాక్ ఏంటన్నది ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది. ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ పేరెపు.. తొలి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రూపొందించిన చిత్రమిది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించాడు. ఈ చిత్రానికి అతను రైటర్ కూడా కావడం విశేషం. శ్రద్ధ శ్రీనాథ్‌తో పాటు షాలిని వడ్నికట్టి, సీరత్ కపూర్ కథానాయికలుగా నటించారు. సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ వయాకామ్ 18 ఈ చిత్రాన్ని నిర్మించింది.
This post was last modified on June 25, 2020 10:36 am
ఎవరు ఔనన్నా కాదన్నా అఖండ తాండవం 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం స్పష్టం. కొన్ని ఏరియాల్లో డీసెంట్ గా…
నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం…
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…