టాలీవుడ్లో ఒక వారం గ్యాప్ తర్వాత మళ్లీ ఓ పెద్ద సినిమా థియేటర్లలోకి దిగుతోంది. ఆ చిత్రమే.. ఎఫ్-3. మీడియం రేంజి సినిమాగా రిలీజై… చాలా పెద్ద స్థాయి విజయం సాధించిన ఎఫ్-2 సినిమాకు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఎఫ్-2లో ఉన్న స్టార్ కాస్ట్ అంతా కొనసాగడంతో పాటు దీనికి అదనపు ఆకర్షణలు కూడా తోడయ్యాయి. ఇంకా పెద్ద బడ్జెట్లో సినిమా తీశారు. ప్రమోషన్లు కూడా గట్టిగా చేస్తున్నారు. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మోత మోగించేస్తుందనే అంచనా వేస్తున్నారంతా.
ఐతే ఎంత హడావుడి చేస్తున్నా.. ఎఫ్-3కి అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఆశించిన స్థాయిలో జరగడం లేదు. మామూలుగా ఈ సినిమా రేంజికి టికెట్లు చాలా వేగంగా అమ్ముడైపోవాలి. షోలు ఈజీగా సోల్డ్ ఔట్ అయిపోవాలి. కానీ బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే ప్రధాన నగరాలన్నింట్లో బుకింగ్స్ చాలా సాధారణంగా ఉన్నాయి. మూడు రోజుల ముందు బుకింగ్స్ ఓపెన్ చేసినా.. ఎక్కడా సోల్డ్ ఔట్ అన్న మాటే కనిపించడం లేదు.
ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో కనిపిస్తున్న షోలు కూడా చాలా చాలా తక్కువ. హైదరాబాద్ సిటీలో ముఖ్యమైన థియేటర్లలో తొలి రోజు బుకింగ్స్ 20-30 శాతం మధ్య కనిపిస్తున్నాయి. ఇంకో మూడు రోజుల్లో రిలీజ్ ఉండగా.. ఇంత పెద్ద సినిమాకు ఈ బుకింగ్స్ ఆశ్చర్యాన్ని కలిగించేవే. గత రెండు నెలల్లో రిలీజైన పెద్ద సినిమాలకు పెంచినట్లు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదనంగా రేట్లు పెంచలేదు. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత దిల్ రాజు మీడియా ఇంటర్వ్యూలో నొక్కి నొక్కి చెప్పారు. కానీ సాధారణ స్థాయిలో గరిష్ఠ రేట్లనే పెట్టడంతో ప్రేక్షకులు వెనుకంజ వేస్తున్నట్లు కనిపిస్తోంది.
హైదరాబాద్ అంతటా మల్టీప్లెక్సుల్లో ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలతో కలిపి రేటు 330 దాకా అవుతోంది. సింగిల్ స్క్రీన్ల రేటు రూ.200 దాటుతోంది. ఈ రేట్లు ఫ్యామిలీ ఆడియన్స్‌కు రీజనబుల్‌గా అనిపించట్లేదు. ఇది ఫ్యామిలీ మూవీ కావడంతో యూత్ కూడా టికెట్ల కోసం ఎగబడట్లేదు. ఈ నేపథ్యంలో సినిమాకు చాలా మంచి టాక్ రాకుంటే చాలా కష్టమే అనిపిస్తోంది.
This post was last modified on May 25, 2022 11:53 am
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…