బాలీవుడ్ హీరో టాలీవుడ్ హీరో ఇద్దరూ కలిసి సినిమా చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. ప్రస్తుతం తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి వెళ్ళడంతో ఇప్పుడు అక్కడి వాళ్ళు ఇక్కడ , ఇక్కడ వాళ్ళు అక్కడ సినిమాలు చేస్తున్నారు. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా తెలుగులో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటిస్తున్నాడు సల్మాన్. ఇటివలే తన పార్ట్ షూట్ కంప్లీట్ చేసేశాడు. చిరుతో కలిసి ఎప్పటి నుండో ఓ సినిమా చేయాలనుకున్న సల్మాన్ ఎట్టకేలకు ఈ సినిమాతో ఆకోరిక నెరవేర్చుకున్నాడు. అలాగే టాలీవుడ్ లో మరో క్లోజ్ ఫ్రెండ్ వెంకీతో కూడా సినిమా చేయబోతున్నాడు సల్మాన్.
ఫర్హాద్ సాంజి అనే దర్శకుడితో హిందీలో ‘కభీ ఈద్ కభీ దివాలీ’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేయబోతున్నాడు. ఇందులో వెంకటేష్ సల్మాన్ ఖాన్ కి అన్నయ్యగా నటిస్తున్నాడు. తాజాగా సల్మాన్ ఖాన్ సినిమాలో చేస్తున్న సంగతితో పాటు అన్నయ్య రోల్ అని కూడా వెంకీ చెప్పేశాడు. నిజానికి వెంకటేష్ -సల్మాన్ ఖాన్ చాలా ఏళ్ల నుండి కలిసి ఓ సినిమా చేయాలని చూస్తున్నారు. ఆ మధ్య వెంకీ ఫ్యామిలీ ఫంక్షన్ లో సల్మాన్ ఖాన్ తో డాన్స్ చేసిన వీడియో చూస్తే వీరిద్దరి మధ్య బాండింగ్ ఫ్రెండ్ షిప్ ఏంటో అర్థమవుతుంది. కానీ సరైన స్క్రిప్ట్ దొరకని కారణం చేత ఈ కాంబో సినిమాకు ఇన్నాళ్లు పట్టింది.
ఏదేమైనా అటు చిరంజీవి ఇటు వెంకటేష్ ఇలా టాలీవుడ్ సీనియర్ హీరోలతో రెండు సినిమాలు ప్లాన్ చేసుకొని త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కానున్నాడు సల్మాన్. ‘గాడ్ ఫాదర్’ లో సల్మాన్ కనిపించేది కాసేపే అయినప్పటికీ ఈ స్పెషల్ రోల్ థియేటర్స్ ఇరు అభిమానులకు కిక్ ఇవ్వడం ఖాయం. ఇక రియర్ లైఫ్ లో ఫ్రెండ్స్ గా ఉన్న వెంకీ సల్లు భాయ్ స్క్రీన్ మీద అన్నదమ్ములుగా ఎలా మెప్పిస్తారో చూడాలి.
This post was last modified on May 25, 2022 11:44 am
అమెరికాలో అధ్యక్ష మార్పును ఆ దేశ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా తెలివిగా అడుగులు…
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ జే. ట్రంప్ పదవీ ప్రమాణం చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు…
స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…