Movie News

NTR30 రాజమౌళి రూట్లో కొరటాల

‘బాహుబలి’ ఫ్రాంచైజీకి సంబంధించి ఎలాంటి పాన్ ఇండియా కాస్టింగ్ ని పెట్టుకోకుండా తెలుగు నటులతోనే సినిమా తీశాడు రాజమౌళి. కానీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు వచ్చే సరికి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న అలియా భట్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు. అజయ్ దేవగన్ ని మరో స్పెషల్ రోల్ కోసం ఎంచుకున్నాడు. ఈ రెండు పాత్రలతో బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాలో తమ అభిమాన నటులు కూడా ఉన్నారనే భావంతో సినిమా చూశారు. ఈ విషయంలో జక్కన్న సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కొరటాల శివ కూడా అదే ఫాలో అవ్వబోతున్నాడు.

ఎన్టీఆర్ తో తన అప్ కమింగ్ పాన్ ఇండియా సినిమాలో రాజమౌళి తరహాలోనే బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని భావిస్తున్నాడు. ఇప్పటికే దీపిక పదుకునేని సంప్రదించారు. ఆమె నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. అలాగే లిస్టులో జాన్వి కపూర్ , అనన్య పాండే పేర్లు కూడా వినిపిస్తున్నాయి. జాన్వి తెలుగు డెబ్యూ ఇచ్చేందుకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. మంచి స్క్రిప్ట్ వస్తే తెలుగు , తమిళ్ లో జాన్వి నటిస్తుందని తన తండ్రి బోణీ కపూర్ స్వయంగా చెప్పాడు. దీంతో కొరటాల కన్ను జాన్వి పై పడిందట.

ప్రస్తుతం NTR30 కి సంబంధించి టెక్నిషియన్స్ ని ఫైనల్ చేసుకున్నాడు కొరటాల. మిగతా కాస్టింగ్ కూడా దాదాపు ఫైనల్ అయిపోయింది. కానీ ఒక్క హీరోయిన్ విషయంలోనే ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంకా ఎవరూ ఫైనల్ అవ్వలేదు. ఏదేమైనా కొరటాల మాత్రం బాలీవుడ్ హీరోయిన్ తోనే సినిమా చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. నార్త్ మార్కెట్ లో క్రేజ్ ఉన్న బ్యూటీ కోసం వలలు వేస్తున్నాడు. తొందర్లోనే హీరోయిన్ ని ఫిక్స్ చేసి ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు. మరి ఎన్టీఆర్ సరసన కనిపించే ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరో వేచి చూడాల్సిందే.

This post was last modified on May 25, 2022 6:42 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

1 hour ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

2 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

2 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

2 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

4 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

5 hours ago