మన దేశంలో ఫైనల్ రన్ కు వచ్చేసిన ఆర్ఆర్ఆర్ ఇప్పుడు ఓటిటిలో కొత్త సంచలనాలు నమోదు చేస్తోంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసిన హిందీ వెర్షన్ రెస్పాన్స్ మాములుగా లేదు. పాకిస్థాన్ లో ఒక తెలుగు డబ్బింగ్ సినిమా మొదటివారంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందంటే అది రాజమౌళి మేజిక్ కాక మరేమిటి. ఇండియా స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన పాయింట్ ఉందని తెలిసినా కూడా అక్కడి ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు. గంగూబాయ్ కటియావాడిని ఈజీగా ఓవర్ టేక్ చేసి మరీ దూసుకుపోతోంది.
అక్కడే కాదు పలుదేశాల్లోనూ నెట్ ఫ్లిక్స్ ఇదే రకమైన స్పందన దక్కించుకుంటోంది. షో పూర్తి చేయడం ఆలస్యం విదేశీయులు ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మళ్ళీ మళ్ళీ చూడాలంటూ తెగ ట్వీట్లు పెడుతున్నారు. యుకె, యుఎస్, లండన్, ఆస్ట్రేలియా తదితర చోట్ల ఆర్ఆర్ఆర్ కు వస్తున్న వ్యూస్ ఓటిటి వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇది ఊహించిందే అయినప్పటికీ మరీ ఈ స్థాయిలో కాదనేది వాళ్ళ అభిప్రాయం. జీ5లో ఉన్న సౌత్ లాంగ్వజెస్ కన్నా నెట్ ఫ్లిక్స్ లోనే దీని దూకుడు ఎక్కువగా ఉంది.
థియేట్రికల్ గా ఇండియాలో ఆర్ఆర్ఆర్ కథ ముగింపుకొచ్చింది. అరవై రోజులు దాటేయడంతో చాలా చోట్ల తీసేశారు. అందుకే డిజిటల్ లో విరుచుకుపడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల నటనకు దక్కుతున్న గ్లోబల్ అప్రిసియేషన్ వాళ్ళ భవిష్యత్తు సినిమాల మార్కెట్ కు ఖచ్చితంగా ఉపయోగపడేదే. ట్రిపులార్ చూశాక వీళ్లిద్దరితో పాటు జక్కన్న గత సినిమాలు ఏవని తవ్వి తీసే పనిలో పడ్డారు ఫారినర్స్. అందులో బాహుబలి చూడని వాళ్ళు కూడా ఉన్నారు. చూస్తుంటే ఈ సెన్సేషన్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.
This post was last modified on May 25, 2022 11:34 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…